Rajinikanth: రజనీ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా.? గవర్నర్‌ను కలవడంపై చర్చ.. సూపర్‌స్టార్ ఏమన్నారంటే..
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఎంతటి చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2017 నుంచి 2021 వరకు నిత్యం రజనీ రాజకీయ జీవితం...
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఎంతటి చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2017 నుంచి 2021 వరకు నిత్యం రజనీ రాజకీయ జీవితం గురించి వర్తలు వస్తూనే ఉండేవి. ఈ నేపథ్యంలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ 2017 డిసెంబర్ 31న ప్రకటించడం, రజనీ మక్కల్ మండ్రం (RMM) పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.
ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన రజనీ అస్వస్తతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచన మేరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు 2021 జులై 12న ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ సూపర్ స్టార్ రాజకీయ జీవితం గురించి చర్చ మొదలైంది. సోమవారం తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవితో సమావేశం కావడంతో వార్తలు గుప్పుమన్నాయి.
రజనీకాంత్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాడని అందులో భాగమే ఈ చర్చలు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై అగ్ర కథనాయకుడు క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రం కోసం ఏది చేయడానికైనా సిద్ధమమన్నారు. గవర్నర్ సమావేశం కేవలం మర్యాద పూర్వకమేనని స్పష్టతనిచ్చారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం క్లిక్ చేయండి..