Viral: డస్ట్‌బిన్ నుంచి చెత్తను తొలగిస్తుండగా పారిశుద్ధ్య కార్మికులకు కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేయగా షాక్
వారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు. ఇటీవల ఓ డస్ట్ బిన్ నుంచి చెత్త తొలగిస్తుండగా.. ఓ ప్లాస్టిక్ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని చెక్ చేయగా...
Tamil Nadu: వారు చెన్నై(Chennai)లోని మధురై(madurai) పట్టణంలో పనిచేసే శానిటరీ వర్కర్స్. కోడి కూయకముందే పనిలో జాయిన్ అయిపోతారు. రోడ్లను క్లీన్ చెయ్యడం.. స్థానికులు డస్ట్ బిన్స్‌లో వేసిన చెత్తను సూదర ప్రాంతాల్లోని డంప్ యార్డులకు తరలించడం వారి డ్యూటీ. ఈ క్రమంలో ఇటీవల కొందరికి మధురై సెంట్రల్ జైలు సమీపంలో డ్యూటీ పడింది. ఉదయాన్నే జైల్ గేట్ దగ్గర్లోని చెత్త డబ్బా నుంచి స్క్రాప్ తొలగిస్తుండగా.. వారికి ఓ ప్లాస్టిక్ సంచి కనిపించింది. ఈ క్రమంలో అందులో ఏముందా అని చెక్ చేసి.. కంగుతిన్నారు. లోపల ఓ హ్యాండ్‌గన్ లభ్యమైంది. దీంతో జైలు అధికారులతో పాటు, కరిమేడు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. వెంటనే స్పాట్‌కు చేరకున్న అధికారులు.. ఆ గన్ స్వాధీనం చేసుకుని.. ఎక్స్‌పర్ట్స్ టీమ్‌తో తనిఖీ చేయించారు. అయితే ఆ హ్యాండ్‌గన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యిందని, రిపేర్ చేసే వీలు కూడా లేదని గుర్తించారు. అందుకే దాన్ని చెత్త బుట్టలో పడేసి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఆ గన్‌ను అక్కడ పడేసిన వెళ్లిన వ్యక్తి కోసం వేట ప్రారంభించారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. జైలుకు కూతవేటు దూరంలోని ప్రాంతం కావడంతో ఇతర కోణాల్లో సైతం విచారణ జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..