Viral: డబ్బు అవసరం ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న సామాన్యుడు.. అమౌంట్ చూసి దిమాక్ ఖరాబ్

అతనికి మనీ అవసరం పడింది. దీంతో ఖాతాలో ఎంత డబ్బు ఉందో చెక్ చేసుకున్నాడు. అంతే కళ్లు తిరిగినంత పనైయ్యింది. ఊహకు కూడా అందనంత డబ్బు అందులో ఉంది.

Viral: డబ్బు అవసరం ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న సామాన్యుడు.. అమౌంట్ చూసి దిమాక్ ఖరాబ్
Money In Account
Follow us

|

Updated on: Aug 08, 2022 | 3:40 PM

Trending: అతను స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. డబ్బులు పోవడం, రావడం కామన్. అతని లావాదేవీలు అన్నీ వేలు, లక్షల్లో మాత్రమే  ఉంటాయి. అయితే వన్ ఫైన్ డే అతను తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని స్టన్ అయ్యాడు. కళ్లు చెదిరిపోయాయి. ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు ఎంత నగదు ఉందో చెక్ చేసుకునేందుకే 2 నిమిషాల సమయం పట్టింది. ఎందుకంటే అతని అకౌంట్లో ఉంది. వేలో.. లక్షలో కాదు.. కోట్లు.. వేల కోట్లు. అవును అక్షరాలు పదహారు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు వచ్చిపడ్డాయి. దీంతో అతనికి ఒకింత ఆశ్చర్యం కలగగా… మరోవైపు భయం వేసింది. బిహార్(Bihar) లఖిసరాయ్ జిల్లా బర్హియా గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బర్హియా గ్రామంలో నివాసం ఉండే సుమన్  రెగ్యూలర్‌గా ట్రేడింగ్ చేస్తూ ఉండేవాడు. అందుకోసం అతను కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన డీమాట్ అకౌంట్ వినియోగించేవాడు. కొద్ది రోజుల అతని బ్యాంకు అకౌంట్లోకి రూ.16,833.42 కోట్లు జమ అయ్యాయి. ఇటీవల మనీ అవసరం అవ్వడంతో..  బ్యాలెన్స్ చెక్ చేసి షాక్ తిన్నాడు. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్నిది తెలియలేదు. ఇప్పటికీ అతడి అకౌంట్లోనే డబ్బు ఉండటం గమనార్హం.

‘తొలుత ఏదైనా టెక్నికల్ సమస్యతో నగదు జమ అయ్యిందని అనుకున్నాం. కానీ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేయగా.. వారు డబ్బు నిజంగానే పడిందని ధృవీకరించారు. ఆ డబ్బు మాది కాదు. అందుకే ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. RTI కింద వివరాలు కోరుతూ దరఖాస్తు చేశాం. ఇప్పటివరకూ రిప్లై రాలేదు’ అని సుమన్ తెలిపాడు. అయితే బ్యాంకు అధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం కానీ, కంప్లైంట్ కానీ రాలేదని.. ఒకవేళ వస్తే ఎంక్వైరీ చేస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..