Telangana: కానిస్టేబుల్ పరీక్ష వాయిదా.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. మళ్లీ ఎప్పుడంటే
తెలంగాణలో (Telangana) పోల్సీ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 21 న జరగాల్సిన పరీక్షను 28న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. 18 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని...
తెలంగాణలో (Telangana) పోల్సీ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 21 న జరగాల్సిన పరీక్షను 28న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. 18 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా.. గతంలో ఎస్సై, కానిస్టేబుల్ (Constable Exam) ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. చెప్పిన విధంగానే ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. కానిస్టేబుల్ రాత పరీక్షను రీ షెడ్యూల్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 16,694 కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ పోటీ నెలకొంది. 17 వేలకు పైగా పోలీసుశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో… జిల్లాలవారీగా పోస్టుల సంఖ్యకూ ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వం విడుదల చేస్తామన్న పోస్టుల్లో అధిక శాతంలో ఇవే కావడంతో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ ఉద్యోగాలన్నీ జిల్లా కేడర్ కు చెందినవి కావటంతో స్థానికులకే ప్రాధాన్యత చేకూరనుంది.
తెలంగాణలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధిక పోస్టులు(సివిల్, ఏఆర్ కలిపి) ఉన్నాయి. ఇక్కడ 1900పైగా ఖాళీలు ఉన్నాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ కేవలం 66 పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏఆర్ విభాగంలోనూ హైదరాబాద్ లోనే అధికంగా ఖాళీలు ఉన్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ రెండో స్థానంలో, వరంగల్ కమిషనరేట్ మూడో స్థానలో ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు 8 లక్షల మంది కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రాష్ట్రానికి చెందిన వారు 98 శాతం ఉండగా మిగిలిన 2 శాతం కర్నాటక, ఏపీ నుంచి అప్లై చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం నుంచి 28 శాతానికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి.
రాష్ట్రంలో మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఏప్రిల్ 28వ తేదీన నోటిఫికేషన్లను జారీ చేసింది. ఇందులో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులు, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.