AP ICET Results: ఏపీ ఐసెట్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. సత్తా చాటిన బాలురు.. ఫలితాలను ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి..
AP ICET 2022: ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్వహించి ఏపీ ఐసెట్ 2022 పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. గతంలో అధికారులు తెలిపినట్లుగానే సోమవారం ఫలితాలను విడుదల చేశారు..
AP ICET 2022: ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్వహించి ఏపీ ఐసెట్ 2022 పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. గతంలో అధికారులు తెలిపినట్లుగానే సోమవారం ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఉన్నత విద్యా మండలి ఐఎసెట్ పరీక్షలను రెండు సెషన్స్‌లో నిర్వహించారు. 24 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కలిపి మొత్తం 107 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్ 2022ను నిర్వహించారు.
ఈ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ ఐసెస్ 2022 పరీక్షకు మొత్తం 42,496 మంది హాజరుకాగా 37,326 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం పాస్ అయ్యారు. ఇక అమ్మాయిలు విషయానికొస్తే 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. తిరుపతికి చెందిన రెడ్డప్పగారి ఖాతేం 180 మార్కులతో మొదటి ర్యాంకును సాధించాడు. రెండో స్థానంలో గుంటూరుకు చెందిన దంటాలా పూజిత వర్ధన్ నిలిచాడు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* రిజల్ట్స్ కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
* అనంతరం హోమ్‌పేజీలో కనిపించే AP ICET- 2022 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విభాగంపై క్లిక్ చేయాలి.
* తర్వాత “Download AP ICET Result 2022″ ని ఎంచుకోవాలి.
* రిజిస్ట్రేషన్ నంబర్, ICET హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..