Navy Jobs 2022: బీటెక్ చేసిన వారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Navy Jobs 2022: బీటెక్ పూర్తి చేసిన వారికి సువర్ణవకాశం. ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. కేరళలోని ఎంజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమనీ జనవరి...
Navy Jobs 2022: బీటెక్ పూర్తి చేసిన వారికి సువర్ణవకాశం. ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. కేరళలోని ఎంజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమనీ జనవరి 2023 నుంచి ప్రత్యేక నావల్ ఓరియంటేషన్ కోర్సు కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ కోర్సుకు సంబంధించి ఎస్‌ఎస్‌సీ- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)లో కోర్సుకు దరఖాస్తు చేసుకోమని అధికారులు సూచించారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో 50 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్/ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్‌వర్కింగ్/ డేటా అనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). లేదా ఎంసీఏ, బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల మాత్రమే ఇందుకు అర్హులు.
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 02-01-1998 నుంచి 01-07-2003 మధ్య జన్మించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను డిగ్రీ, పీజీలో వచ్చిన మార్కులు.. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 15-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..