AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Recruitment: శ్రీహరికోట స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ISRO Recruitment: శ్రీహరికోటలోని సూళ్లూరుపేటలోని స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌లో ఖాళీల భర్తీ చేయనున్నారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ షార్‌) ఈ పోస్టులను భర్తీ....

ISRO Recruitment: శ్రీహరికోట స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Narender Vaitla
|

Updated on: Aug 08, 2022 | 7:46 PM

Share

ISRO Recruitment: శ్రీహరికోటలోని సూళ్లూరుపేటలోని స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌లో ఖాళీల భర్తీ చేయనున్నారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ షార్‌) ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 19 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) (02), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఫిజిక్స్) (01), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (బయాలజీ) (01), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కెమిస్ట్రీ) (01), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) (02), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (హిందీ) (02), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లిష్) (01), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (కెమిస్ట్రీ) (01)ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(బయాలజీ) (01), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (పీఈటీ) (02), ప్రైమరీ టీచర్‌ (05) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీనియర్ సెకండరీ, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఎల్ఈడీ, బీపీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28-08-2022 నాటికి పీజీటీ అభ్యర్థులకు 18 నుంచి 40, టీజీటీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, పీటీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* రాత పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌లో సెంటర్లను ఏర్పాటు చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 28-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్