Viral Video: నేషనల్‌ హైవేపై అకస్మత్తుగా కూలిన కొండచరియలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

జాతీయ రహదారి 5 (NH-5)పై అకస్మత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో వార్త సంచలనంగా మారింది.

Viral Video: నేషనల్‌ హైవేపై అకస్మత్తుగా కూలిన కొండచరియలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Nh
Follow us

|

Updated on: Aug 08, 2022 | 7:06 PM

Viral Video:  హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లోని భావనగర్‌లో జాతీయ రహదారి 5 (NH-5)పై అకస్మత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో వార్త సంచలనంగా మారింది. ఈ పర్వతం పడిపోయిన సమయంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. కొండచరియలు విరిగిపడ్డ భయానక దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. కొండచరియలు విరిగిపడిన ఈ వీడియోనే భయాందోళనలకు గురి చేస్తుంది.

కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై శిథిలాలు కుప్పలు,తెప్పలుగా పడ్డాయి. వాటిని తొలగించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో ఇక్కడికి కూడా వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఈ కొండచరియలను మొబైల్‌లో వీడియో తీస్తూ కనిపించారు. ఏది ఏమైనప్పటికీ దృశ్యాలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి