మందుబాబులూ! మీకు నోరూరించే న్యూస్..మళ్లీ అందుబాటులోకి 400 ఏళ్ల నాటి క్రేజీ బీర్

బీరు తాగితే ఒంటికి మంచిదని కూడా చెబుతుంటారు. అయితే, ఇప్పుడు మరో కొత్తరకం బీరు మందుబాబులకు అందుబాటులోకి వచ్చింది. ఇది అలాంటి ఇలాంటి బీరు కాదు..

మందుబాబులూ! మీకు నోరూరించే న్యూస్..మళ్లీ అందుబాటులోకి 400 ఏళ్ల నాటి క్రేజీ బీర్
Beer
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2022 | 6:44 PM

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు.. తాగే బాటిల్‌ మీద కూడా ఈ విషయం స్పష్టంగా రాసే ఉంటుంది. అవేమీ పట్టవన్నుట్టుగానే… మందుబాబులు నిర్భయంగా లాగించేస్తారు. పైగా అందులో బీరు తాగితే ఒంటికి మంచిదని కూడా చెబుతుంటారు. కొన్ని నివేదికలు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే, ఇప్పుడు మరో కొత్తరకం బీరు మందుబాబులకు అందుబాటులోకి వచ్చింది. ఇది అలాంటి ఇలాంటి బీరు కాదు.. దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటి బీరు ఇది. అవును, ఇది నిజమే..ఒక దశాబ్దం పరిశోధన, ఎన్నో పరీక్షల ఫలితంగా ఈక్వెడార్ బయో ఇంజనీర్ జేవియర్ కార్వాజల్ 400 సంవత్సరాల క్రితం నాటి బీరును పునఃసృష్టి చేయగలిగాడు. అది లాటిన్ అమెరికాలో అత్యంత పురాతనమైనది. పూర్తి సమాచారంలోకి వెళితే..

ఈక్వెడార్ బయో ఇంజనీర్ అయిన జేవియర్ కార్వాజల్ 400 సంవత్సరాల కిత్రం అందుబాటులో ఉన్న బీర్‌ను దాని ఈస్ట్ నుండి మ‌ళ్లీ సృష్టించాడు. కార్వాజల్ పాత ఓక్ బారెల్ లోపల ఈస్ట్ నమూనాను కనిపెట్టాడు.. ఇది లాటిన్ అమెరికా పురాతన బీర్‌గా చెబుతున్నారు. స్పెషలిస్ట్ బీర్ మ్యాగజైన్‌లను చదువుతున్నప్పుడు క్విటోలోని పురాతన ఫ్రాన్సిస్కాన్ బ్రూవరీ గురించి తెలుసుకున్న కార్వాజ‌ల్ దీనిపై తీవ్రంగా కృషి చేశాడు. ఏడాది త‌ర్వాత చివ‌ర‌కు 2008లో పాత బ్రూవ‌రీ నుండి ఒక బారెల్‌ను కొని, దీన్ని రూపొందించాడు.

నిజానికి, ఈక్వెడార్ రాజధానిగా ఉన్న ప్రాంతానికి అతడే గోధుమలు, బార్లీని పరిచయం చేశాడని కొందరు చరిత్రకారులు నమ్ముతున్నారు. ఇక‌, ఆయ‌న చేసిన ఈ బీరును ప్రాంతీయంగా చిచా అనేవారు. దీన్ని లాటిన్ అమెరికాలో పులియబెట్టిన, పులియబెట్టని పానీయంగా సేవించేవారు. ఇది అండీస్, అమెజోనియా ప్రాంతాల నుండి ఉద్భవించింది. ఇది అమెరికాను స్పెయిన్ పాలించ‌క ముందు అక్క‌డి స్థానిక ప్రజలు తయారుచేసిన పానీయంగా చెప్పుకుంటారు. ఇక‌, స్పానిష్ ఆక్రమణకు ముందు, దాని అనంతర కాలంలో వివిధ రకాల మొక్కజొన్న ల్యాండ్‌రేస్‌ల నుండి తయారైన మొక్కజొన్న బీరుకు చిచా అత్యంత సాధారణ రూపం అని చరిత్రకారులు చెబుతారు. అయితే, తాజాగా తయారైన ఈ బీరు కోసం ఏక‌ కణ సూక్ష్మజీవిని కేవలం ఒక చెక్క ముక్క నుండి తీసుకున్నారు. ఫ్లెమిష్ మూలానికి చెందిన ఫ్రాన్సిస్కాన్ వ్య‌క్తి జోడోకో రికే 1566లో క్విటోలో మొదటిసారిగా తయారుచేసిన ఈ బీర్ సూత్రాన్ని తిరిగి పొందడంలో చివరికి కీల‌క‌ విజ‌యం సాధించారు.

ఇవి కూడా చదవండి

ఈస్ట్‌ను పునరుత్థానం చేసిన ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. ప్రస్తుత ఈక్వెడార్ రాజధానికి గోధుమలు మరియు బార్లీని పరిచయం చేసిన ఫ్లెమిష్ మూలానికి చెందిన ఫ్రాన్సిస్కాన్ ఫ్రియర్ జోడోకో రికే 1566లో క్విటోలో తయారు చేసిన పానీయం యొక్క సూత్రాన్ని తిరిగి పొందడంలో సూక్ష్మజీవి కీలకం. 1537 మరియు 1680 మధ్య నిర్మించిన గంభీరమైన మూడు-హెక్టార్ల సముదాయమైన కాన్వెంటో డి సావో ఫ్రాన్సిస్కో వద్ద అతను వెతుకుతున్న దానిని కనుగొన్నాడు. ఒక బారెల్ లోపల నుండి అతను ఒక చీలికను సేకరించాడు మరియు మైక్రోస్కోప్ కింద అతను చాలా కాలం సాగు చేసిన తర్వాత, ఈస్ట్‌ను “పునరుత్థానం” చేయడానికి అనుమతించిన జీవిని చూశాడు. ఈక్వెడార్ రాజధానిలోని పాత బ్రూవరీ గురించి ప్రత్యేక ప్రచురణల ద్వారా కార్వాజల్‌కు తెలుసు. అతను ఇతర ఈస్ట్‌ను తిరిగి పొందాడు. ఫ్రాన్సిస్కాన్‌ల పానీయం నుండి దానిని కనుగొనాలని పట్టుబట్టాడు. 2008లో దీనిని చేరుకోవడానికి ఒక సంవత్సరం పట్టింది.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి