Blood Bank Center : నల్లకుంట రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్‌లో దారుణం.. రక్తం ఎక్కించిన బాలుడికి హెచ్ఐవీ..!
గత రెండేళ్లుగా తల సెమియా తో బాధపడుతున్న బాలుడికి నల్లకుంట రెడ్ క్రాస్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు పేరెంట్స్.. నిలోఫర్ వైద్యుల సూచన మేరకు బ్లడ్ టెస్ట్ చేయగా..
Blood Bank Center : నల్లకుంట రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో దారుణం వెలుగు చూసింది. తలసేమియాతో బాధపడుతూ తరుచుగా రక్తం ఎక్కించుకుంటున్న మూడేళ్ల బాలుడికి హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. గత రెండేళ్లుగా తల సెమియా తో బాధపడుతున్న బాలుడికి నల్లకుంట రెడ్ క్రాస్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు పేరెంట్స్.. నిలోఫర్ వైద్యుల సూచన మేరకు బ్లడ్ టెస్ట్ చేయగా హెచ్ఐవి సోకినట్టు నిర్ధారణ అయింది. నల్లకుంట రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో గత రెండున్నరేళ్లుగా ప్రతి 15 రోజులకు ఒకసారి బాలుడికి రక్తం ఎక్కిస్తున్నారు. గత నెల 20న కూడా బ్లడ్ ఎక్కించారు. జులై 28న బ్లడ్ బ్యాంకు ఇచ్చిన రిపోర్టులో బాబుకి హెచ్ఐవీ నిర్దారణ అయిందని తల్లిదండ్రుల చేతిలో రిపోర్టు పెట్టారు. దీంతో బాబు తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. ఇదెక్కడ అన్యాయం అంటూ బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
బాబుకు ఏడు నెలల వయసున్నప్పటినుంచి నల్లకుంట రెడ్ డ్రెస్ క్రాస్ లో రక్తం సేకరిస్తున్నట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. మొదటినుంచి లేని వైరస్ ఇప్పుడు ఎలా వచ్చిందని నిలదీస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు. ఈ మేరకు నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసలే తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి హెచ్ఐవీ ఉన్నదని తేలడం పిడుగుపాటుగా మారింది. తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. అసలు లోపం ఎక్కడ తలెత్తిందో తెలుసుకోవాలని అనుకున్నారు. తమ బాబుకి ఎదురైన చేదు అనుభవం మరో బిడ్డకు జరక్కూడదని అనుకున్నారు చిన్నారి తల్లిదండ్రులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి