AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andra Pradesh: పెంచిన మనసు విలవిల.. 17ఏళ్లుగా పెంచుకున్న శునకానికి ఘనంగా అంత్యక్రియలు..

అబ్బా....ఏం బతుకురా...కుక్కగా పుట్టినా బాగుండేది అనుకునేట౦తగా బతికి౦ది ఆ శునకం. ఆ ఇంట్లో తాను ఓ కుటుంబ సభ్యుడిగా మారిపోయింది. అందుకే

Andra Pradesh: పెంచిన మనసు విలవిల.. 17ఏళ్లుగా పెంచుకున్న శునకానికి ఘనంగా అంత్యక్రియలు..
Dog
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2022 | 8:34 PM

Share

Andra Pradesh: ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోతే దానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన శ్రీకాకుళం జిల్లా సరిహద్దులో చోటు చేసుకుంది. సాధారణంగా ఎవరికైనా దరిద్రం వెంటాడితే కుక్క బతుకు బతికాడు అంటూ హేళన చేస్తారు. చావుని కూడా కుక్క చావు చనిపోయాడంటూ పోలిక తెస్తారు. కానీ శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని ఒడిశాకి చెందిన పర్లాకిమిడిలోని టున్ను గౌడ్ పెంపుడు శునకానిది మాత్రం తన రూటే సపరేటు. అబ్బా….ఏం బతుకురా…కుక్కగా పుట్టినా బాగుండేది అనుకునేట౦తగా బతికి౦ది ఆ శునకం. ఆ ఇంట్లో తాను ఓ కుటుంబ సభ్యుడిగా మారిపోయింది. అందుకే గత 17 ఏళ్లుగా ఏ లోటు లేకుండా పెరిగింది.

టున్ను గౌడ్ కుటుంబ సభ్యులతో చక్కటి అఫెక్షన్ ఏర్పరచుకోవడంతో రాజభోగాన్ని అనుభవి౦చి౦ది శునకం. అందుకే అనారోగ్యంతో కుక్క చనిపోతే తమ కుటుంబ సభ్యుడే చనిపోయినట్టుగా భావి౦చి౦ది గౌడ్ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరై విలపించారు. భారీ వర్షం లో కూడా ఘనంగా ఊరేగించారు. వాహనాన్ని పూలతో అలంకరించారు. ఇంటిల్లిపాది మిన్నంటిన రోదనలతో శునకాన్ని ఎత్తుకుని ఏడుస్తూ కుంగిపోయారు. బ్యాండ్ బాజా ఊరేగింపుతో పెంపుడు శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలు నిర్వహించడంతో పెంపుడు జంతువులపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి