రన్నింగ్ ట్రైన్‌లో షాకింగ్‌ సీన్‌.. పరుగులు తీసిన ప్రయాణికులు

వేగంగా దూసుకెళ్తున్న ట్రైన్‌లో సడన్‌గా పాము ప్రత్యక్షమైంది. ఈ హఠాత్‌పరిణామానికి తీవ్ర భయభ్రాంతలయ్యారు ప్రయాణికులు. అరుపులు, కేకలతో అటూ ఇటూ పరుగులు తీసారు.

Phani CH

|

Aug 09, 2022 | 3:00 PM

వేగంగా దూసుకెళ్తున్న ట్రైన్‌లో సడన్‌గా పాము ప్రత్యక్షమైంది. ఈ హఠాత్‌పరిణామానికి తీవ్ర భయభ్రాంతలయ్యారు ప్రయాణికులు. అరుపులు, కేకలతో అటూ ఇటూ పరుగులు తీసారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. జూలై 27 రాత్రి తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్‌ 5 కంపార్ట్‌మెంట్‌లో పాము హల్‌చల్‌ చేసింది. దాంతో ప్రయాణికులు టీటీకి ఫిర్యాదు చేశారు. రైలు తిరూర్ స్టేషన్ దాటిన తర్వాత బెర్త్‌ కింద ఉన్న లగేజ్‌ వద్ద పాము కనిపించిందని ప్రయాణికులు తెలిపారు. మొబైల్‌లో తీసిన పాము ఫొటో కూడా చూపించారు. సమాచారం అందుకున్న కోజికోడ్ రైల్వే స్టేషన్‌ అధికారులు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు రైలును ఆ స్టేషన్‌లో నిలిపివేశారు. ఎస్‌ 5 కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులందరిని ఖాళీ చేయించి.. పాములు పట్టే ఇద్దరు వ్యక్తులను రప్పించి వెతికించారు. అయితే ఆ పాము కనిపించలేదు. కంపార్ట్‌లోని హోల్‌ ద్వారా అది వెళ్లిపోయి ఉండవచ్చు లేదా అక్కడే దాక్కొని ఉండొచ్చని అన్నారు. అయితే పాము ఫొటోను చూసిన సిబ్బంది అది అంత ప్రమాదం కాదని తెలిపారు. అనంతరం ఆ హోల్‌ను మూసివేశారు. అర్ధ రాత్రి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బేకరీలో దోపిడీకి వచ్చిన దొంగ.. అడ్డగించిన మహిళ ఏం చేసిందంటే

భూమిని తవ్వతుండగా భాకీ శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం

నెల‌కు మూడుసార్లే స్నానం చేస్తా అంటున్న మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Shamna Kasim: ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్న పూర్ణ?

నా శృంగార జీవితం గొప్పగా లేదు.. అందుకే ఆ డైరెక్టర్ నన్ను పట్టేశాడు

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu