భూమిని తవ్వతుండగా భాకీ శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం
జమ్మూ కాశ్మీర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్ జిల్లాలో 2 పురాతన శిల్పాలు బయటపడ్డాయి. అందులో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం అని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది.
జమ్మూ కాశ్మీర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్ జిల్లాలో 2 పురాతన శిల్పాలు బయటపడ్డాయి. అందులో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం అని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది. బుద్గామ్‌లోని గుడ్‌సథూ గ్రామంలోని వ్యక్తులు ఓ స్థలంలో తవ్వకాలు జరుపుతుతండగా.. ఓ శిల్పం కనిపించింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిల్పాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ బృందాన్ని పిలిపించి విగ్రహాన్ని పరిశీలించగా, ఆ శిల్పం విష్ణుమూర్తిది అని తేలింది. ఈ విగ్రహం దాదాపు 9వ శతాబ్దానికి చెందినదని.. దాదాపు 1,200 సంవత్సరాల క్రితం నాటిదని వారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ శిల్పం మూడు తలలతో.. నాలుగు చేతులతో ఉంది. విగ్రహం కుడి చేయి ఎగువ భాగంలో కమలం ఉంది. అదే విధంగా బుద్గాంలోని ఖాగ్ ప్రాంతంలో మరో శిల్పాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు శిల్పాలను కాశ్మీర్‌లోని ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్‌కు అందజేసినట్లు బుద్గామ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాహిర్ సలీమ్ ఖాన్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెలకు మూడుసార్లే స్నానం చేస్తా అంటున్న మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Shamna Kasim: ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్న పూర్ణ?
నా శృంగార జీవితం గొప్పగా లేదు.. అందుకే ఆ డైరెక్టర్ నన్ను పట్టేశాడు
కళ్యాణ్ రామ్ భార్య స్వాతి… బ్యాగ్రౌండ్, ట్యాలెంట్.. మామూలుగా లేదుగా…
Sita Ramam: లవ్‌స్టోరీ క్లాసికలే కాని.. బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం ఊరమాసు