AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: దారుణంగా కత్తితో పొడిచి చంపి.. మృతదేహాన్ని బ్యాగ్ లో కుక్కి.. సీన్ కట్ చేస్తే

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ (Ghaziabad) లో ఓ మహిళ.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసింది. బ్లేడ్, కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తాడుతో కట్టి, ప్లాస్టిక్ తో చుట్టి ట్రాలీ బ్యాగ్ లో కుక్కింది....

Crime: దారుణంగా కత్తితో పొడిచి చంపి.. మృతదేహాన్ని బ్యాగ్ లో కుక్కి.. సీన్ కట్ చేస్తే
Crime
Ganesh Mudavath
|

Updated on: Aug 09, 2022 | 4:11 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ (Ghaziabad) లో ఓ మహిళ.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసింది. బ్లేడ్, కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తాడుతో కట్టి, ప్లాస్టిక్ తో చుట్టి ట్రాలీ బ్యాగ్ లో కుక్కింది. అతని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు ఆటో రిక్షాలో ఎక్కించి.. దగ్గర్లోని రైల్వే స్టేషన్ లో దింపాలని కోరింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. లగేజీ బ్యాగ్ లో ఏముందని ప్రశ్నించారు. వారికి ఏదో నచ్చజెప్పేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. చివరకు బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అతను ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రీత్ శర్మ అనే మహిళ తన 22 ఏళ్ల పార్ట్ నర్ బార్బర్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్ పోలీసులు శర్మపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.

కాగా.. ప్రీత్ శర్మకు గతంలో వివాహం జరిగింది. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో ప్రీత్ శర్మ భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో శర్మకు ఫిరోజ్ బార్బర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. బార్బర్ హత్యకు గల కారణాలను శర్మ వెల్లడించనప్పటికీ.. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తి ఈ ఘటనకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్