AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంటి నిర్మాణ పనుల్లోకి వచ్చిన కూలీలు.. అక్కడ కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్!

అతడొక చెప్పుల వ్యాపారి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ముందు రోజు రాత్రి ఇంటి నిర్మాణ పనులు చూసుకుని..

Viral: ఇంటి నిర్మాణ పనుల్లోకి వచ్చిన కూలీలు.. అక్కడ కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్!
Representative Image
Ravi Kiran
|

Updated on: Aug 09, 2022 | 6:00 PM

Share

అతడొక చెప్పుల వ్యాపారి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ముందు రోజు రాత్రి ఇంటి నిర్మాణ పనులు చూసుకుని.. అక్కడే నిద్రపోయాడు. సీన్ కట్ చేస్తే.. తెల్లారేసరికి పనుల్లోకి వచ్చారు కూలీలు. అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా హడలిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో చోటు చేసుకుంది. ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రా సమీపంలోని రకాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సికిందర్ స్థానికంగా ఓ చెప్పుల ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. లాభాలు బాగా రావడంతో అక్కడే ఓ కొత్త ఇల్లు నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. ప్రతీరోజూ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి చేరుకొని.. భోజనం అనంతరం కొత్త ఇంటి పనులను పరిశీలించేవాడు. ఆ తర్వాత అక్కడే నిద్రపోయేవాడు. గురువారం కూడా ఇదే రీతిలో రాత్రి వెళ్లి కొత్త నిర్మిస్తున్న ఇంట్లో పడుకున్నాడు. తెల్లారింది.. కూలీలు ఒక్కొక్కరూ పనుల్లోకి వస్తున్నారు. ఇక వారికి అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ తగిలింది. సికిందర్ రక్తపు మడుగులో విగతజీవిగా పడునున్నాడు. అతడి గొంతు కోసినట్లుగా గుర్తులు శరీరం మీద ఉన్నాయి. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఖాకీలు విచారణ చేపట్టారు.

సికిందర్ కొత్త ఇంటి నిర్మాణం పక్కన ఉన్న ఇంటిలో బంటి, సోనూ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారని.. సోనూతో సికిందర్ అఫైర్ పెట్టుకున్నాడని బంటి అనుమానించేవాడని.. ఈ క్రమంలోనే అతడ్ని చంపేసి ఉంటాడని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. దీంతో పరారీలో ఉన్న బంటి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల