Viral Video: బయటపడ్డ రెండో ప్రపంచం యుద్ధం నాటి బాంబు.. పేలుడు తీవ్రత చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే..
Viral News: శాస్త్రసాంకేతికగా ఎంత ముందుకు వెళ్తున్నా చరిత్ర మిగిల్చే జ్ఞాపకాలు ఇంకా అలాగే ఉంటాయి. వీటిలో మంచివి ఉన్నట్లు చెడు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వందల ఏళ్ల క్రితం జరిగిన యుద్ధం తాలుకూ ఆనవాలు అడపాదడపా బయటపడుతూ...
Viral Video: శాస్త్రసాంకేతికగా ఎంత ముందుకు వెళ్తున్నా చరిత్ర మిగిల్చే జ్ఞాపకాలు ఇంకా అలాగే ఉంటాయి. వీటిలో మంచివి ఉన్నట్లు చెడు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వందల ఏళ్ల క్రితం జరిగిన యుద్ధం తాలుకూ ఆనవాలు అడపాదడపా బయటపడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఇటలీలో వెలుగులోకి వచ్చింది.
ఇటలీలోని బోర్గో అనే గ్రామంలోని పో అనే నది వద్ద గత నెల 25వ తేదీన ఓ మత్య్సకారుడికి విచిత్రమైన వస్తువు కనిపించింది. భారీ ఆకారంతో ఉన్న వస్తువు అనుమానాదస్పదంగా ఉండడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన సైనికులకు దానిని పరిశీలిచంగా అది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా ప్రయోగించిన బాంబుగా గుర్తించారు. అయితే ఆ సమయంలో అది పేలలేదు. తాజాగా ఇటలీలో వాతావరణం వేడెక్కడం, నదిలో నీరు ఎండి పోవడంతో ఈ బాంబ్ బయటపడింది.
అమెరికాలో రూపొందిన ఈ బాంబులో 240 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నట్లు సైనికులు తెలిపారు. బాంబును నిర్వీర్వం చేయడానికి సైనికులు వ్యయప్రయాసలకు ఓడ్చారు. ఇందుకోసం నది సమీపంలో నివసిస్తున్న సుమారు 3000 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ మార్గం గుండా రైలు, రోడ్డు, వాయు మార్గాలను మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్ సదరు బాంబును అక్కడి నుంచి 30 మైళ్ల దూరాన ఉన్న క్వారీకి తీసుకెళ్లి పేల్చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బాంబు పేలుడు వీడియో..
The drought-stricken waters of Italy’s River Po are running so low that they revealed a previously submerged World War Two bomb https://t.co/6P5xQeSXlV pic.twitter.com/HcaP76aqLl
— Reuters (@Reuters) August 7, 2022
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..