Crocodile attack :దర్గాకు వెళ్లిన యువకుడిని ఈడ్చుకెళ్లిన మొసలి.. ఆ మర్నాడు నది ఒడ్డున భయానక దృశ్యాలు..
రుతుపవనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటిలో నదిలోంచి బయటకు వచ్చిన మొసలి.. ఓ యువకుడిని నోటకరుచుకుని అమాంతంగా నీళ్లలోకి ఈడ్చుకెళ్లింది.
Crocodile attack: గుజరాత్‌లోని వడోదరలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రుతుపవనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటిలో నదిలోంచి బయటకు వచ్చిన మొసలి.. ఓ యువకుడిని నోటకరుచుకుని అమాంతంగా నీళ్లలోకి ఈడ్చుకెళ్లింది. యువకుడి అరుపులు విన్న స్థానిక ప్రజలు గట్టిగా కేకలు వేస్తూ..తలో కర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. మొసలి యువకుడిని నదిలోకి లాగేసుకుని కనిపించకుండా పోయింది. ఆ మరుసటి రోజు నదిరోడ్డున భయానక దృశ్యాలు కనిపించాయి. మొసలి ఈడ్చుకెళ్లిన ఆ యువకుడి కొన్ని ఛిద్రమైన భాగాలు నది ఒడ్డున పడి ఉన్నాయి. అది చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వడోదరలో ఇమ్రాన్ దేవాన్ అనే 30 ఏళ్ల యువకుడిని మొసలి లాక్కెళ్లింది. మృతుడి సోదరుడు జావేద్ తెలిపిన వివరాల ప్రకారం, ఇమ్రాన్ నది ఒడ్డున నిర్మించిన దర్గా వద్దకు వెళ్లాడు. అదే సమయంలో నీళ్లలో నుంచి బయటకు వచ్చిన మొసలి అతడిపై దాడి చేసి మొసలి రెండు దవడలతో గట్టిగా పట్టుకుని నదిలోకి ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత నీటి లోతుల్లోకి వెళ్లి అదృశ్యమైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు నదిలో గంటల తరబడి వెతికినా ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. మరుసటి రోజు అతని మృతదేహం ముక్కలు వేర్వేరు చోట్ల కనిపించాయి. ఈ భాగాలకు చేతులు, కాళ్ళు అసలు ఆచూకీ లేకుండా పోయింది. ఆ భయానక దృశ్యాలు చూసిన స్థానికులు చలించిపోయారు. భయంతో వణికిపోయారు. మొసళ్లు ఇప్పుడు ప్రజల ప్రాణాలకు పెద్ద ముప్పుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొసళ్లు నది నుంచి బయటకు రాకుండా ఉండేలా అధికార యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే, వడోదర సమీపంలో ధాధర్, విశ్వామిత్రి అనే రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల్లో చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 200కు పైగా మొసళ్లు ఉన్నాయి. వర్షాకాలంలో నదులు ప్రవహించినప్పుడు చాలా మొసళ్ళు తరచుగా నీటి నుండి బయటకు వచ్చి నగరంలోని వీధుల్లో సంచరిస్తుంటాయి. దీంతో నదికి సమీపంలో నివసించే ప్రజలు వర్షాకాలంలో భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి