AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virosh: పెళ్ళికి పిలవలేదని చిన్నారి అలక.. ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట.. వీడియో

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే ‘విరోష్’ పెళ్లి వేడుక ముగిసినా, దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంది

Virosh: పెళ్ళికి పిలవలేదని చిన్నారి అలక.. ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట.. వీడియో
Virosh
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2026 | 6:39 PM

Share

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత కూడా బిజీ బిజీగా గడిపారు కొత్త దంపతులు. అలాగే విజయ్, రష్మిక టీమ్ దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ , అదేవిధంగా దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు, అలాగే హైదరాబాద్ లో అభిమానులకు బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే రష్మిక, విజయ్ రిసెప్షన్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది.

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..

అయితే విజయ్, రష్మిక పెళ్ళికి తనను ఎందుకు పిలవలేదు అంటూ ఓ చిన్నారి మొనీమధ్య చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ-రష్మికలు పెళ్లి చేసుకున్నారు కదా.. మేం కూడా మీ ఫ్యాన్స్‌మే కదా.. మరి మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు.? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మేం కూడా మీ కోసం సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తున్నాం కదా.! మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట.? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి. అంటూ వీడియో చేసింది ఆ చిన్నారి.

ఇవి కూడా చదవండి

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఆ చిన్నారి వీడియో వైరల్ అవ్వడంతోపాటు అది విజయ్, రష్మిక వరకు చేరింది. దాంతో విరోష్ జంట ఆ పాపను కలిశారు. ఆ చిన్నారిని ఇంటికి పిలిచి స్వయంగా తమ చేతులతో ఆ చిన్నారికి వడ్డించారు విరోష్ జంట. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భోజనం తర్వాత ఆ చిన్నారితో విజయ్, రష్మిక ముచ్చటించారు. ఆ చిన్నారి క్యూట్ మాటలకూ విజయ్, రష్మిక తెగ నవ్వుకున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us