Monkey trick: పిల్ల కోసం తల్లడిల్లిన వానరం.. వర్ణించలేనిది అమ్మ ప్రేమ.. చుస్తే మీరు కూడా ఎమోషనల్ అవుతారు..
అల్లరి చేష్టలకు కేరాఫ్ అడ్రస్ కోతులు. ఇవి చేసే అల్లరి ఒకింత విసుగు కలిగించినా జనాలు వాటి చిలిపి పనులను ఇష్టపడతారు. తాజాగా ఓ కోతి పిల్ల ఏవో గింజలు తిని వాంతి చేసుకుంటూ నానా అవస్థలు పడుతుంది.
అల్లరి చేష్టలకు కేరాఫ్ అడ్రస్ కోతులు. ఇవి చేసే అల్లరి ఒకింత విసుగు కలిగించినా జనాలు వాటి చిలిపి పనులను ఇష్టపడతారు. తాజాగా ఓ కోతి పిల్ల ఏవో గింజలు తిని వాంతి చేసుకుంటూ నానా అవస్థలు పడుతుంది. అది గమనించిన తల్లికోతి అద్భుతమైన ట్రీట్‌మెంట్‌తో తన బిడ్డను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పిల్లకోతి కొన్ని గింజలను నోట్లో వేసుకుంది. కాసేపటికి అది ఇబ్బంది పడుతుంది. మింగిన గింజలను కక్కేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యం కావడం లేదు. ఇదంతా తల్లికోతి గమనించింది. వెంటనే పిల్లకోతిని తన రెండు చేతుల్లో గట్టిగా పట్టుకుంది. కడుపులో తట్టుకున్న పదార్ధాలు బయటకు వచ్చే విధంగా.. దాన్ని కాస్త పైకి, కిందకు పలుమార్లు ఊపింది. దీంతో పిల్లకోతి మింగిన గింజలు అన్నీ నోటి నుంచి బైటకి వచ్చేసాయి. దాంతో పిల్లకోతి ఊపిరిపీల్చుకుంది. ఆ తర్వాత.. తల్లిని కౌగిలించుకుని ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సూపర్ ట్రీట్‌మెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..