AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day sale 2022: కేవలం రూ.1500లకే విమాన టికెట్‌.. గో ఫస్ట్‌ బంపర్‌ ఆఫర్‌..!

Independence Day sale 2022: సాధారణ విమానయాన సంస్థలు ప్రయాణికుల కోసం అప్పుడప్పుడు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా పండగ సీజన్‌లో, ఇతర సమయాల్లో తక్కువ ధరల్లో..

Independence Day sale 2022: కేవలం రూ.1500లకే విమాన టికెట్‌.. గో ఫస్ట్‌ బంపర్‌ ఆఫర్‌..!
Go First
Follow us
Subhash Goud

|

Updated on: Aug 10, 2022 | 4:43 PM

Independence Day sale 2022: సాధారణ విమానయాన సంస్థలు ప్రయాణికుల కోసం అప్పుడప్పుడు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా పండగ సీజన్‌లో, ఇతర సమయాల్లో తక్కువ ధరల్లో టికెట్‌ బుక్‌ చేసుకుని ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తుంటాయి విమాన కంపెనీలు. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా కంపెనీలు తమ కస్టమర్ల కోసం గో ఫస్ట్ ఆఫర్‌ను తీసుకొచ్చాయి. ఈ ప్లాన్‌ కింద తక్కువ ధరల్లో విమాన ప్రయాణం చేయవచ్చు. భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ (GO FIRST) మీకు విమాన టిక్కెట్లను చౌకగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్ పేరు గో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సేల్‌తో అందుబాటులోకి వచ్చింది.

కేవలం రూ.1508కే విమన టికెట్‌:

కేవలం రూ.1508కే విమాన టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ చౌకైన విమాన టికెట్‌ను ఆగస్టు 10 నుండి ఆగస్టు 13 వరకు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది కంపెనీ. ఈ సెల్‌లో భాగంగా కేవలం రూ. 1508కే విమాన టికెట్‌ను బుక్‌ చేసుకుని ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని GO FIRST తన అధికారిక ట్వీట్‌లో ఈ ఆఫర్ గురించి తెలిపింది. ఈ ఆఫర్ కింద, మీరు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 13, 2022 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో టికెట్‌ను బుక్‌ చేసుకుంటే 1 సెప్టెంబర్ నుండి 31 మార్చి 2023 వరకు ప్రయాణించవచ్చు. మీరు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి GoFirst అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించవచ్చు. అంతే కాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరింత సమాచారం కావాలంటే అధికారిక లింక్ ని కూడా సందర్శించి తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ టికెట్ ఆఫర్ రూ.1508 నుంచి ప్రారంభం అవుతుంది. కొన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణం చేయాలంటే ఎక్కువగా ఉండవచ్చు. విమాన సంస్థ ఎంపిక చేసిన ప్రాంతంకు మాత్రమే ఈ తక్కువ ధరతో ప్రారంభం అవుతుంది. మీరు ప్రయాణంచే ప్రాంతం బట్టి ధరల్లో తేడా ఉంటుందని గమనించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్నిబిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి