AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education Loan: విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలను తెలుసుకోండి!

Education Loan: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు మెరుగుపడేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఎంతో కష్టపడి పిల్లలను ఉన్నత చదువులను చదివిస్తుంటారు..

Education Loan: విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలను తెలుసుకోండి!
Education Loan
Subhash Goud
|

Updated on: Aug 10, 2022 | 4:05 PM

Share

Education Loan: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు మెరుగుపడేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఎంతో కష్టపడి పిల్లలను ఉన్నత చదువులను చదివిస్తుంటారు. ఇక డబ్బున్న వాళ్లు అయితే లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారు. కానీ నిరుపేదలకు అంత స్థోమత లేక పిల్లలను ఉన్నత చదువులను చదివించలేకపోతారు. అలాంటి వారికి బ్యాంకులు మంచి అవకాశం కల్పిస్తుంటాయి. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదివేందుకు కూడా రుణాలు అందిస్తుంటాయి. రుణ సదుపాయంతో విదేశాలకు వెళ్లి ఉన్నత కోర్సులు చేయవచ్చు. అయితే మీరు ఎడ్యుకేషన్‌ లోన్‌ గురించి దరఖాస్తు చేయాలని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే.. రుణగ్రహీత నమోదు చేసుకోవాలనుకునే సంస్థ IIT లేదా IIM వంటి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌గా ఉండాలి. లేదా UGC/ AICTE/ ప్రభుత్వం మొదలైన వాటి ద్వారా ఆమోదించి ఉండాలి. రుణం పొందేందుకు ముఖ్యమైన అంశాలలో ఇదొకటి.

బ్యాంకులు, లెండింగ్ సంస్థలు సాధారణంగా రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఫీజులతో రెగ్యులర్ కోర్సులకు విద్యా రుణాలపై గరిష్ట పరిమితులను నిర్దేశిస్తాయి. అయితే, ఇన్‌స్టిట్యూట్‌, కోర్సును బట్టి రుణ పరిమితి మారవచ్చు. భారతదేశంలో చేపట్టే అధ్యయనాల కోసం రూ. 4 లక్షల కంటే ఎక్కువ రుణాల కోసం బ్యాంక్ మార్జిన్ మొత్తాన్ని అభ్యర్థించవచ్చు. ఇది సాధారణంగా మొత్తం ఫండ్ అవసరంలో 5% ఉంటుంది. అయితే, బ్యాంక్ కోర్సు రకం, ఇన్‌స్టిట్యూట్, రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణం మంజూరు చేస్తారు. బ్యాంకు బజార్‌.కామ్‌ సీఈవో అదిల్‌ శెట్టి వివరాల ప్రకారం.. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు రూ. 7.5 లక్షల వరకు రుణం పొందవచ్చని తెలిపారు. భారతదేశంలో విద్యా రుణాల కోసం బ్యాంకులు అనుమతించిన గరిష్ట రీపేమెంట్ వ్యవధి కోర్సు పూర్తయిన తర్వాత, వర్తించే మారటోరియం వ్యవధి తర్వాత 15 సంవత్సరాల వరకు ఉంటుంది.

విద్యా రుణాలు సాధారణంగా ట్యూషన్, హాస్టల్ వసతి, యూనిఫారాలు, లైబ్రరీ/లేబొరేటరీ యాక్సెస్, కోర్సు మెటీరియల్ (పుస్తకాలు, ల్యాప్‌టాప్), రీఫండబుల్ డిపాజిట్లు, రవాణా, మరిన్ని వంటి కోర్సు-సంబంధిత ఖర్చుల పరిధిని కవర్ చేస్తాయి. అలాగే మీ ఆర్థిక ప్రొఫైల్‌ సరిగ్గా లేకపోతే విద్యా రుణాన్ని తిరస్కరిస్తాయి బ్యాంకులు. అందులో తక్కువ క్రెడిట్ స్కోర్ ఉండటం, UGC/AICTE/ప్రభుత్వానికి అనుబంధంగా లేని విద్యా సంస్థలు వంటి కారణంగా రుణం ఇచ్చేందుకు తిరస్కరించవచ్చు. ఇలాంటి రుణం లభిస్తే సాధారణంగా అధిక వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుందని గుర్తించుకోవాలి. మీకు అన్ని అర్హతలు ఉన్నప్పుడే ఎడ్యుకేషన్‌ లోన్‌ పొందడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విద్యా రుణాలపై పన్ను ప్రయోజనాలు

రుణగ్రహీతలు తమ విద్యా రుణం వడ్డీపై సెక్షన్ 80E కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, ఆమోదించబడిన రుణ సంస్థ ద్వారా రుణం మంజూరు చేయబడినట్లయితే మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు.

మరిన్నిబిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్