AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. హైవేపై 8 గంటల పాటు కారులో ఇరుక్కుపోయిన దంపతులు.. చివరకు

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. నుహ్ సమీపంలో గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు రక్తమడుగులో, సాయం అందక ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఎనిమిది గంటల పాటు కారులో చిక్కుకున్న ఢిల్లీకి చెందిన ఒక జంట రక్తస్రావంతో మరణించారని పోలీసులు తెలిపారు.

అయ్యో దేవుడా.. హైవేపై 8 గంటల పాటు కారులో ఇరుక్కుపోయిన దంపతులు.. చివరకు
Couple Trapped In Car
Balaraju Goud
|

Updated on: Dec 05, 2025 | 12:52 PM

Share

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. నుహ్ సమీపంలో గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు రక్తమడుగులో, సాయం అందక ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఎనిమిది గంటల పాటు కారులో చిక్కుకున్న ఢిల్లీకి చెందిన ఒక జంట రక్తస్రావంతో మరణించారని పోలీసులు తెలిపారు. రాత్రిపూట వందలాది వాహనాలు ఆ దుర్ఘటనను దాటుకుంటూ వెళ్లాయని, అయినప్పటికీ ఎవరూ ఆపలేదు. అధికారులకు సమాచారం అందించలేదు.

మృతదేహాల బట్టి, రోడ్డు ప్రమాదం తర్వాత వారిద్దరూ కొన్ని గంటలు బతికి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. భర్త తన భార్యను పట్టుకుని ప్రాణాలు వదిలారు. అనంత దారుణంగా వారి చివరి క్షణాలు గడిపి తుది శ్వాస విడిచి ఉండవచ్చని అధికారులు తెలిపారు.

డిసెంబర్ 3 మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య నుహ్‌లోని నోసెరా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే, బుధవారం ఉదయం 7.30 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్‌కు మొదటి సమాచారం అందింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, దంపతులు మృతి చెంది కనిపించారు. మృతదేహాలు నలిగిపోయి, వాహనంలో చిక్కుకున్నట్లు గుర్తించారు.

బాధితులను 42 ఏళ్ల లచ్చి రామ్, అతని భార్య కుసుమ్ లత (38)గా గుర్తించారు. రాజస్థాన్‌లోని కరౌలికి చెందిన వారికి నలుగురు పిల్లలు. ఇద్దరు మైనర్ కుమారులు, ఇద్దరు మైనర్ కుమార్తెలు. ఢిల్లీలోని బుద్ విహార్‌లోని మంగేరం పార్క్‌లో నివసిస్తున్నారు. రామ్ నిర్మాణ కాంట్రాక్టర్‌గా పని చేయగా, లత గృహిణి. నుహ్ సదర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాద వివరాలు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో వారి బూడిద రంగు వ్యాగన్-ఆర్ కారును వెనుక నుండి ఒక భారీ వాహనం వేగంగా ఢీకొట్టిందని తేలింది. “ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారును మెటల్ క్రాష్ బారియర్‌లోకి నెట్టారు. అది గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జు అయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన దంపతులు కారు లోపలే రక్తస్రావం జరిగి మరణించారు” అని ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై ధ్వంసమైన కారు ఇంతసేపు ఎందుకు గుర్తించకుండా పోయిందో ఇంకా స్పష్టంగా తెలియలేదని ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. “పెట్రోలింగ్‌లో నిర్లక్ష్యం వల్ల సమాచారం అందడంలో జాప్యం జరిగిందో లేదో తదుపరి దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది” అని ఆయన అన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే నుండి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కారును ఢీకొట్టిన రెండు అనుమానిత వాహనాలను గుర్తించారు. “మేము త్వరలోనే సంబంధిత వాహనాన్ని కనుగొంటాము” అని ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, బుధవారం నుహ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 106 (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైంది), 281 కింద గుర్తు తెలియని డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోస్ట్‌మార్టం పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబానికి అప్పగించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..