Amazon Great Freedom Festival: నేటితో ముగియనున్న అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సెల్‌.. ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపు

Amazon Great Freedom Festival: అమెజాన్‌ గ్రేట్‌ ప్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది. పలు స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు ప్రకటించింది. Tecno, Redmi, Realme స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లను..

Amazon Great Freedom Festival: నేటితో ముగియనున్న అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సెల్‌.. ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపు
Follow us
Subhash Goud

|

Updated on: Aug 10, 2022 | 6:51 PM

Amazon Great Freedom Festival: అమెజాన్‌ గ్రేట్‌ ప్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది. పలు స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు ప్రకటించింది. Tecno, Redmi, Realme స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లను పొందవచ్చు. ఈ ఫోన్‌లపై 40% వరకు తగ్గింపుతో Amazonలో పొందవచ్చు. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన ఈ సెల్ 10వ తేదీతో ముగియనుంది. రూ. 10 వేల రేంజ్‌లో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్లు 6 నుంచి 7 వేల రూపాయలకు ఆఫర్ లో లభిస్తున్నాయి. SBI బ్యాంక్ కార్డ్‌లతో చెల్లించడం ద్వారా ఈ ఫోన్‌లపై తక్షణంగా రూ. 1,250 క్యాష్‌బ్యాక్ సదుపాయం కూడా పొందవచ్చు. ఫోన్ ధర కంటే ఎక్కువ ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై కూడా ఆఫర్లు ఉన్నాయి.

ఇటీవల విడుదలైన టెక్నో ఫోన్ దీని ధర రూ.11,499 ఉండగా, ఈ డీల్‌లో 26శాతం తగ్గింపును పొందవచ్చు. ఆ ఆఫర్‌లలో భాగంగా మీరు దీన్ని కేవలం రూ. 8,499కి కొనుగోలు చేయవచ్చు. SBI బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై ఈ ఫోన్‌పై రూ.1250 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆ తర్వాత ధర కేవలం రూ.7,249కి పడిపోతుంది. ఫోన్ కొనే సమయంలో ఏదైనా పాత ఫోన్ ఇస్తే రూ.8 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఫోన్‌లో 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

రియల్‌మీ ఫోన్‌లపై కూడా ఆఫర్‌ ఉంది. రూ.7,499 నుండి మొదలయ్యే స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 5,999 మాత్రమే లభిస్తుంది. SBI బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై ఈ ఫోన్‌పై తక్షణ క్యాష్‌బ్యాక్ రూ.1,250 పొందవచ్చు. ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4GB RAM, 64GB ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంది. దీనిని 256GB వరకు విస్తరించవచ్చు. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. దీనిలో ప్రధాన కెమెరా 13MP, రెండవది 2MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, మూడవది 2MP మాక్రో లెన్స్ కెమెరా. సెల్ఫీ కోసం 8MP కెమెరా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక Redmi 10A స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.11,999 ఉండగా, ఆఫర్‌లో 27 శాతం తగ్గింపుతో రూ. 8,799కి కొనుగోలు చేయవచ్చు. SBI బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై ఈ ఫోన్‌పై రూ. 1,250 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ వెనుక కెమెరా ఉంది. దీనిలో ప్రధాన కెమెరా 13MP. సెల్ఫీ కోసం 8MP కెమెరా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి