Maruti Electric Car: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్.. ఇతర కార్లతో పోటీ.. ఎప్పటి వరకు వస్తుందంటే..!

Maruti Electric Car:: ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్‌లో దేశంలోనే అతిపెద్ద విక్రయదారుగా ఉంది. అయితే త్వరలో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి..

Maruti Electric Car: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్.. ఇతర కార్లతో పోటీ.. ఎప్పటి వరకు వస్తుందంటే..!
Maruti Electric Car
Follow us

|

Updated on: Aug 09, 2022 | 6:30 AM

Maruti Electric Car:: ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్‌లో దేశంలోనే అతిపెద్ద విక్రయదారుగా ఉంది. అయితే త్వరలో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి టాటా మోటార్స్ ఈ కింగ్‌షిప్‌తో పోటీ పడనుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మారుతీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును 2025 నాటికి దేశ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారును గుజరాత్ ఆధారిత ప్లాంట్‌లో తయారు చేస్తుంది.

ధర ఎంత?

మారుతి తన ఎలక్ట్రిక్ కారు EV టెక్నాలజీ, బ్యాటరీ ధరను పరిగణనలోకి తీసుకుంటే దీని ధర రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ ప్రకారం, దాని కొత్త EV చాలా కాలంగా పరీక్షించబడుతోంది. ఇది భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఒక్కసారి చార్జ్ చేస్తే..

మారుతి ఎలక్ట్రిక్ కారు మిడ్-సైజ్ SUV కావచ్చని వార్తలు వస్తున్నాయి. దీని కాన్సెప్ట్ ఫార్మాట్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించవచ్చు. ఇది 48 kWh, 59 kWh రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు ఒక్కసారి చార్జ్‌ చేస్తే 400 కిమీ నుండి 500 కిమీల వరకు ప్రయాణించే అవకాశం ఉందని తెలుస్తోంది.అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి