Fact Check: పీఎం ముద్రా లోన్‌ కోసం ప్రభుత్వం రూ.4,500 తీసుకుంటుందా..? ఇందులో నిజమెంత? క్లారిటీ ఇచ్చిన పీఐబీ

Fact Check: నేటి కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టి బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు..

Fact Check: పీఎం ముద్రా లోన్‌ కోసం ప్రభుత్వం రూ.4,500 తీసుకుంటుందా..? ఇందులో నిజమెంత? క్లారిటీ ఇచ్చిన పీఐబీ
Atal Pension Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Aug 08, 2022 | 8:05 AM

Fact Check: నేటి కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టి బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ రోజుల్లో వినియోగదారులకు ఆన్‌లైన్‌లో రుణాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. అయితే పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకంతో, సైబర్ మోసాల కేసులు కూడా వేగంగా పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు నిలువునా దోచుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ లేఖ తెగ వైరల్ అవుతోంది. ఈ లేఖలో ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వడంపై ఈ పోస్టు వైరల్‌ అవుతోంది. దీనితో పాటు, కొన్ని నిమిషాల్లో 10 లక్షల రూపాయల పీఎం ముద్ర లోన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందుకు రూ.4,500 మాత్రమే చెల్లించాలి. ఇందుకు సంబంధించిన కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈ పోస్టు సారాంశం. వైరల్‌ అవుతున్న ఈ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ క్లారిటీ ఇచ్చింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరుతో వైరల్ అవుతున్న ఈ లేఖను PIB తనిఖీ చేసింది. ఈ లేఖలో పీఎం ముద్రా రుణం పేరుతో వైరల్‌ అవుతున్న పోస్టు పూర్తిగా నకిలీదని తేల్చి చెప్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అటువంటి ఉత్తర్వులు గానీ, లేఖ గానీ జారీ చేయలేదని తెలిపిది. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ఆర్థిక శాఖ రూ.4,500 డిమాండ్ చేయలేదని, ఈ పోస్టును చేసి నమ్మి డబ్బులు ఏ అకౌంట్‌కు పంపవద్దని, అలా పంపినట్లయితే మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడటం ఖాయమని హెచ్చరించిది.

ఇవి కూడా చదవండి

PM ముద్రా లోన్ అంటే ఏమిటి?

దేశంలో నిరుద్యోగాన్ని తొలగించి, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా లోన్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రభుత్వం 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రజలకు మూడు రకాల రుణాలను అందజేస్తుంది. ఈ పథకం కింద మొదటి శిశు రుణం రూ.50 వేలు, కిషోర్ రుణం రూ.5 లక్షల వరకు, తరుణ్ రూ.10 లక్షల వరకు రుణం ఈ పథకం కింద అందజేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి