Monkeypox: మంకీపాక్స్‌ నుంచి కోలుకున్నా.. శరీరంలో వైరస్‌ అలాగే ఉంటుంది.. అధ్యయనంలో కీలక విషయాలు

Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, స్పెయిన్, బ్రిటన్, కెనడాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో ..

Monkeypox: మంకీపాక్స్‌ నుంచి కోలుకున్నా.. శరీరంలో వైరస్‌ అలాగే ఉంటుంది.. అధ్యయనంలో కీలక విషయాలు
Monkeypox Virus
Follow us

|

Updated on: Aug 10, 2022 | 5:19 PM

Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, స్పెయిన్, బ్రిటన్, కెనడాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కూడా 9 కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు చాలా దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందడానికి గల కారణాలను సరిగ్గా నిర్ధారించడం లేదు. మంకీపాక్స్ వైరస్ గురించి కూడా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో మంకీపాక్స్‌ లక్షణాలు, వ్యాప్తి చెందే మార్గాల గురించి మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో ఒక అధ్యయనం ప్రచురించబడింది.

ఈ వైరస్ నుంచి కోలుకున్న కొన్ని వారాల తర్వాత కూడా అది శరీరంలోనే ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న ఇటలీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పరిశోధకురాలు కొల్లావిటా మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ వ్యాధి లక్షణాలు కనిపించిన చాలా వారాల తర్వాత కూడా ఈ వైరస్‌ రోగి వీర్యంలో ఉంటుంద తెలిపారు. రోగిపై పరిశోధనలో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపారు.

దీనికి సంబంధించి స్పెయిన్‌లో పరిశోధన కూడా జరిగింది. ఇందులో మంకీపాక్స్ వైరస్ కఫం, మూత్రంలో కూడా ఉందని గుర్తించారు. 12 మంది రోగులపై చేసిన పరిశోధనలో మల నాళంలో కూడా వైరస్ ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. అయితే, ఈ వైరస్ వీర్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనికి సంబంధించి పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వైరస్ అనేక రకాలుగా విస్తరిస్తోంది:

ఈ వైరస్ చాలా రకాలుగా వ్యాపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. స్కిన్-టు-స్కిన్ స్పర్శ, రోగికి దగ్గరగా ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా ఈ మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. మంకీపాక్స్ రోగి గాయాలు, దద్దుర్లు ఇతరులకు తగలడం వలన కూడా వైరస్‌ సంభవించవచ్చు.

భయపడాల్సిన అవసరం లేదు

మంకీపాక్స్ వైరస్ తో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ అన్షుమన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రాణాంతకం కాదని, కేసులు పెరుగుతున్నా మరణాల రేటు మాత్రం పెద్దగా లేదని తెలిపారు. స్వలింగ సంపర్కులపై కూడా ఎక్కువ కేసులు వస్తున్నాయి. వైరస్‌లో ఇంకా ఎలాంటి మ్యుటేషన్‌ కనిపించలేదు. అందుకే ఈ వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ లక్షణాల గురించి ప్రజలు తెలుసుకోవడం, దానిని నివారించడానికి నియమాలను పాటించడం చాలా ముఖ్యం అని పరిశోధకులు సూచిస్తున్నారు.

మంకీపాక్స్‌ లక్షణాలు:

-జ్వరం

-తలనొప్పి

-కండరాల నొప్పి

-శరీరం, ముఖం మీద దద్దుర్లు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..