Foot Care Tips : వర్షాకాలంలో పాదాలకు ఇన్ఫెక్షన్ల ముప్పు.. ఈ టిప్స్‌ పాటించండి..!

వర్షాకాలం ప్రారంభమైతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. పాదాలు తరచుగా వర్షంలో తడిసిపోతాయి. ఈ సందర్భంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా రింగ్వార్మ్, దురద సమస్యలు పాదాలను వేధిస్తాయి.

Foot Care Tips : వర్షాకాలంలో పాదాలకు ఇన్ఫెక్షన్ల ముప్పు.. ఈ టిప్స్‌ పాటించండి..!
Foot Care Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 10, 2022 | 9:27 PM

Best Monsoon Foot Care Tips : అసలే వర్షాకాలం.. ఆపై ప్రతిరోజూ వర్షపు నీటిలో తడుస్తూ విధులకు వెళ్లాల్సిందే. ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా ఉండటం అంటే అది సాధ్యం కాని పని. అందుకే మీ చర్మం జుట్టుతో పాటు, వర్షాకాలంలో పాదాలకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలం ప్రారంభమైతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. పాదాలు తరచుగా వర్షంలో తడిసిపోతాయి. ఈ సందర్భంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా రింగ్వార్మ్, దురద సమస్యలు పాదాలను వేధిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలంలో బ‌య‌ట తిరిగి వ‌చ్చాక పాదాలు దుర‌ద‌గా అనిపిస్తాయి. అప్పుడు కొద్దిగా నిమ్మ రసం, వెనిగ‌ర్ మిక్స్ చేసి దుర‌ద ఉన్న చోట రాస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

– ప్ర‌తి రోజు రాత్రి తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత కొబ్బరినూనె రాస్తూ, కొద్దిసేపు పాదాలను మర్దన చేస్తే పాదాల‌పై పేరుకున్న మురికి, క్రిములు తొల‌గుతాయి.

ఇవి కూడా చదవండి

– వ‌ర్షాకాలంలో ప్ర‌తి రోజు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆల్మండ్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకోవడం చాలా ఉత్త‌మం.

– వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి.. పాదాలకు ఉన్న మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రుద్దాలి. డెడ్ స్కిన్‌ను తొలగిస్తే పాదాల పగుళ్లు త‌గ్గుతాయి.

– వేపాకులను పేస్ట్‌లా చేసి ఇక స్పూన్‌ పసుపు కలిపి పాదాలకు ప్యాక్‌ వేయాలి. ఆరిన తర్వాత షాంపూతో రుద్ది కడిగితే పగుళ్ల సమస్య తగ్గిపోతుంది.

– వర్షాకాలంలో త‌ర‌చూ షూస్ వేసుకోకూడ‌దు. ఎందుకంటే వర్షంలో తడిసినపుడు షూస్‌లో ఉన్న‌ తేమ‌ పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది.

– రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్ ఈక్వ‌ల్‌గా తీసుకొని రాత్రివేళ పాదాలకు మర్దన చేయాలి. మార్నింగ్ గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి పాదాలను కడిగితే, మురికి సులువుగా తొలగిపోతుంది.

– కాలి గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కాలి గోళ్ల మధ్య ఇసుక, ధూళి పేరుకుపోతాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్