Milk: పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎప్పుడు ఎలా తీసుకోవాలో తెలుసా?
Milk Health Benefits: సంపూర్ణ ఆహారమని పేరున్న పాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్లు ఎ, డి, ఇ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి.
Milk Health Benefits: సంపూర్ణ ఆహారమని పేరున్న పాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్లు ఎ, డి, ఇ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా పాలను డైట్‌లో చేర్చుకోవాలని తరచూ చెబుతుంటారు. ఈక్రమంలో కొందరికి పాలు ఇష్టం లేకపోయినా..బలవంతంగా అయినా ఆరోగ్యానికి మంచిది అని పాలు తాగుతుంటారు. అయితే పాలు తాగేందుకు కూడా ఒక విధానం ఉంటుంది. తాగాలి అన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు తాగితే ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయాల్లో పాలు తాగవద్దు
- రోజంతా దగ్గు ఉంటే పాలు అసలు తాగవద్దు. అలాగే కఫం ఉన్నా పాలకు దూరంగా ఉండాలి. ఇక రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొందరికీ తలనొప్పి సమస్యలు తలెత్తవచ్చు.
- గొంతులో దురద వచ్చినా పాలు తాగవద్దు. చర్మ సమస్యలు, ముక్కు, చెవి, దగ్గు, జలుబు, జ్వరం, గొంతు దురద ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలి. ఈ సమస్యలతో బాధపడేవారు వేసవిలో పడుకునే సమయంలో పాలు తాగవచ్చు.
- గేదె పాల కంటే ఆవు పాలు ఆరోగ్యానికి మేలు. గుండెల్లో మంట ఉంటే ఆ పాలలో కాస్త రుహాఫ్జా కలుపుకుని తాగండి. జ్వరం, గుండెల్లో మంట, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారు ఆవు పాలను ఎక్కువగా తీసుకోవాలి.
- ఆకలితో ఉన్నప్పుడు పాలు తీసుకోవచ్చు. అయితే భోజనం చేసిన తర్వాత పాలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా జలుబు, దగ్గు, విరేచనాలు, వాంతులు, జ్వరం, అజీర్ణం తదితర సమస్యలు తలెత్తుతాయి.
- భోజనంతో పాటు పాలు తాగవద్దు. కొందరిలో ఇది చర్మ సమస్యలను, అలెర్జీలను కలిగిస్తుంది. ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఉన్నవారు పాలలో కాస్త ఎండు అల్లం పొడి వేసి మరిగించాలి.
ఇవి కూడా చదవండి
గమనిక: ఈ ఆర్టికల్ కేవలం హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారం బట్టి ప్రచురించబడింది. దీంతో టీవీ9 వెబ్‌సైట్, టీవీ9కు ఎలాంటి సంబంధం లేదు.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..