Warm Water: గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?

Warm Water Benefits: గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణుల. ముఖ్యంగా శరీరంలో కొవ్వును తగ్గించుకుని బరువు తగ్గించుకోవాలనుకునేవారు రోజూ గోరువెచ్చని నీటిని తాగాలని సూచిస్తున్నారు

Warm Water: గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?
Hot Water
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2022 | 7:05 PM

Warm Water Benefits: గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణుల. ముఖ్యంగా శరీరంలో కొవ్వును తగ్గించుకుని బరువు తగ్గించుకోవాలనుకునేవారు రోజూ గోరువెచ్చని నీటిని తాగాలని సూచిస్తున్నారు. అదేవిధంగా చాలామంది జీర్ణ సమస్యలు, తక్కువ రోగనిరోధక శక్తితో బాధపడుతున్నారు. ఇక ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే చర్మం మిలమిలా మెరిసిపోతుంది. మైగ్రేన్‌లను తగ్గిస్తుంది. ఇవే కాదు ఒక గ్లాసు వేడినీటితో ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి.

బరువు తగ్గేందుకు..

వేడి నీటిని తాగడం వల్ల కేలరీలను వేగంగా బర్న్ అవుతాయి. ఇది మెటబాలిజం రేటును క్రమబద్ధీకరించేందుకు లేదా పెంచేందుకు సహాయపడుతుంది. అదనపు ప్రయోజనాలను పొందడానికి వేడి కప్పులో కాసింత నిమ్మకాయ చుక్కలను జోడించండి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ మెరుగయ్యేలా..

ఒక గ్లాసు వేడి నీరు రక్త నాళాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. అంతేగాకుండా ఇది మీకు తక్షణ శక్తినిస్తుంది.

జీర్ణ సమస్యల పరిష్కారం కోసం..

వేడి నీరు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో అదనపు యాసిడ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

జలుబు, దగ్గు నివారణకు..

జలుబు, దగ్గుతో పాటు సైనస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు వేడి నీటిని తాగాలి. ఇది సైనస్‌ నుంచి కాస్త రిలాక్స్‌ కల్పిస్తుంది. అలాగే అన్ని రకాల నొప్పుల నుండి, ముఖ్యంగా తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

వేడి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పాటు ఇతర జీర్ణ సమస్యలను తగ్గుతాయి. శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోవడం వల్ల మలబద్ధకం తలెత్తుతుంది. అయితే గోరువెచ్చని నీరు ప్రేగు కదలికలను పెంచడంతో పాటు అంతర్గత అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారం బట్టి ప్రచురించబడింది. దీంతో టీవీ9 వెబ్‌సైట్, టీవీ9కు ఎలాంటి సంబంధం లేదు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..