ఆ బీజేపీ ఎమ్మెల్యే దాడి కేసు సూత్రధారి మావో హతం
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మాడ్వి ముయ్య అలియాస్ జోగ కుయ్యమ్ హతమయ్యాడు. కాగా దంతెవాడ జిల్లాలోని అడవుల్లో మావోలు నక్కిఉన్నారన్న సమాచారంతో ఈ ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో మావోలు కాల్పులకు దిగడంతో.. అక్కడ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మాడ్వి ముయ్య మరణించినట్లు భద్రతా బలగాలు నిర్ధారించాయి. కాగా బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిపై దాడికి పథకం పన్నిన […]
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మాడ్వి ముయ్య అలియాస్ జోగ కుయ్యమ్ హతమయ్యాడు. కాగా దంతెవాడ జిల్లాలోని అడవుల్లో మావోలు నక్కిఉన్నారన్న సమాచారంతో ఈ ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో మావోలు కాల్పులకు దిగడంతో.. అక్కడ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మాడ్వి ముయ్య మరణించినట్లు భద్రతా బలగాలు నిర్ధారించాయి.
కాగా బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిపై దాడికి పథకం పన్నిన కేసులో.. అలాగే 2017లో సుక్మాలో భద్రతాదళాలపై మావోలు జరిపిన దాడిలోనూ ముయ్య కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఛత్తీస్‌గడ్‌లో మోస్ట్ వాంటెడ్ మావోల లిస్ట్‌లో ఉన్న ఇతడిపై 8లక్షల రివార్డు కూడా ఉంది.