ఫొని తుఫాన్ నేపథ్యంలో.. ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
ఫొని తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తుఫాన్ వేళ ఎదుర్కోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం సెక్రటరీలు హాజరయ్యారు. వీరితో పాటు ఐఎండీ, ఎన్‌డీఎంఏ, పీఎంవో అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఫొని తుఫాన్.. చిలక-పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు […]
ఫొని తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తుఫాన్ వేళ ఎదుర్కోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం సెక్రటరీలు హాజరయ్యారు. వీరితో పాటు ఐఎండీ, ఎన్‌డీఎంఏ, పీఎంవో అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఫొని తుఫాన్.. చిలక-పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచే తీరాన్ని పెట్రోలింగ్ చేస్తున్నట్లు కోస్ట్ గార్డు ఐజీ పరమేశ్ తెలిపారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేశామన్నారు. ప్రస్తుతం 8 రెస్క్యూ టీంలు సిద్ధంగా ఉన్నాయని.. విశాఖ, చెన్నైలో భారీ షిప్‌లు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వీటితోపాటు హెలికాప్టర్లను కూడా రిలీఫ్ వర్క్ కోసం సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.