Viral Video : రెస్టారెంట్‌లో జంట పాముల సయ్యాట.. లోకాన్ని మరచి ఇలా..

చాలా మంది పాము వీడియోలను చూడటం ఇష్టపడతారు. ఎందుకంటే అవి చాలా ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటి ఒక వీడియోలో, రెండు పాములు రెస్టారెంట్ వెలుపల కనిపించాయి.

Viral Video : రెస్టారెంట్‌లో జంట పాముల సయ్యాట.. లోకాన్ని మరచి ఇలా..
Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 11, 2022 | 2:15 PM

Two Snakes Dance: మనం రోజు ఎన్నో అద్భుతమైన వీడియోలను సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని భయపెట్టేలా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా, మరికొన్ని నవ్వుకునేలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో జంటపాముల సయ్యాట..వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరికీ హడల్‌. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు. దాని పేరు ఎత్తడానికి కూడా కొంత మంది ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే.. అక్కడి దారిదాపుల్లోకి వెళ్లడానికి సాహాసించరు. అయినప్పటికీ, చాలా మంది పాము వీడియోలను చూడటం ఇష్టపడతారు. ఎందుకంటే అవి చాలా ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటి ఒక వీడియోలో, రెండు పాములు రెస్టారెంట్ వెలుపల కనిపించాయి. అవి ఒకదానినొకటి పెనవేసుకుని. అవి నెమ్మదిగా పెనవేసుకుని అందమైన డ్యాన్స్‌ చేస్తున్నాయి. ఒకదానికొకటి అందంగా సమన్వయంతో మెలివేసుకోవటం వీడియో స్పష్టంగా చూడవచ్చు. పాముల యొక్క ఈ వీడియోను ది ఫిగెన్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసింది. వీడియోకి “హౌ రొమాంటిక్”అనే క్యాప్షన్ ఈ వీడియోని అప్‌లోడ్‌ చేశారు.

ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియదు గానీ, జంట పాములు ఓ రెస్టారెంట్‌లోకి దూరాయి. ఆ రెస్టారెంట్‌లో జనాల రద్దీ కూడా బాగానే ఉంది. కానీ, ఆ పాములు రెండు ఎవరినీ పట్టించుకోవటం లేదు. తమకు ఈ లోకంతో సంబంధం లేదన్నట్టుగా అవి రెండు మైమరచిపోయి సయ్యాటలో మునిగి ఉన్నాయి. అక్కడి ప్రజలు ఆ పాములను చూసి ఏ మాత్రం భయపడటం లేదు..ఎందుకంటే వారు రెస్టారెంట్‌లోనికి, బయటకు జనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. జంటపాముల సయ్యాట చూసిన ప్రజలు తమ ఫోన్‌లలో ఈ వీడియో ను రికార్డ్ చేయడం కూడా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు దీనిని లవ్ డ్యాన్స్ అని కామెంట్‌ చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇది అద్భుతం అంటూ కొనియాడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి తెగ హల్చల్ చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి