Viral: సాధారణ తనిఖీలు.. బస్సును ఆపిన పోలీసులు.. తత్తరపాటుకు గురైన వ్యక్తి.. సీన్ కట్ చేస్తే!

చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అటుగా ఓ ప్రైవేటు బస్సు వెళ్తుండగా..

Viral: సాధారణ తనిఖీలు.. బస్సును ఆపిన పోలీసులు.. తత్తరపాటుకు గురైన వ్యక్తి.. సీన్ కట్ చేస్తే!
Representative Image 1
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 11, 2022 | 1:48 PM

ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఇంకెన్ని రైడ్స్ చేసినా.. డబ్బు, బంగారం అక్రమ రవాణా దందా ఆగట్లేదు. ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు అక్రమ రవాణా చేసేందుకు కేటుగాళ్లు క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువ. అలాంటివారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. ఇదే కోవలో ఇటీవల ఓ బస్సులో సోదాలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు, పోలీసులకు రూ. 1.22 కోట్ల క్యాష్ లభ్యమైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆగష్టు 9వ తేదీ ఒడిశాలోని బైద్యనాథ్‌పూర్‌ లిమిట్స్ దగ్గరున్న చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అటుగా ఓ ప్రైవేటు బస్సు వెళ్తుండగా.. దాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. పోలీసులను చూడగానే అందులో ఉన్న దశరద్ సౌకర్ అనే పాసింజర్ తత్తరపాటుకు గురయ్యాడు. అనుమానమొచ్చి అతడి బ్యాగ్ చెక్ చేయగా.. అందులో సుమారు రూ. 1.2 కోట్ల క్యాష్ ఉంది. అన్ని కూడా 500 రూపాయల నోట్లు కావడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ క్యాష్ స్వాధీనం చేసుకుని.. సౌకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

2.2 కిలోల బరువున్న 24 బంగారు బిస్కెట్లు స్థానికంగా ఉండే నగల వ్యాపారి ఆనంద్ సుబితికి సరఫరా చేయడంతో.. అందుకుగానూ తనకు రూ. 1.2 కోట్ల క్యాష్ ముట్టజెప్పాడని సౌకర్ విచారణలో వెల్లడించాడు. దీంతో సౌకర్‌ను తదుపరి విచారణ నిమిత్తం ఎక్సైజ్ అధికారులు.. బైద్యనాథ్‌పూర్‌ పోలీసులకు అప్పగించారు. అటు జ్యువెలరీ షాప్ యజమాని అయిన ఆనంద్‌ దగ్గర నుంచి కూడా 24 బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బంగారు బిస్కెట్లపై దక్షిణాఫ్రికా సింబల్స్ ముద్రించబడి ఉండటంతో.. విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.