AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నదీ తీరం ఒడ్డున మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటని చూడగా కళ్లు జిగేల్.!

నదీ తీరం ఒడ్డున ఓ వ్యక్తి జాగింగ్ చేస్తుండగా.. అతడికి మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది...

Viral: నదీ తీరం ఒడ్డున మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటని చూడగా కళ్లు జిగేల్.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Aug 11, 2022 | 1:26 PM

Share

సముద్రంలో ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఇందుకు నిదర్శనంగా ఇజ్రాయిల్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. నదీ తీరం ఒడ్డున ఓ వ్యక్తి జాగింగ్ చేస్తుండగా.. అతడికి మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది. ఏంటని దగ్గరకెళ్లి చూడగా కళ్లు జిగేల్‌మన్నాయి. అదొక అరుదైన నాణెం. ఇంతకీ అది ఏ కాలం నాటిది.? దాని హిస్టరీ ఏంటి.? అనేది తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల హైఫా నదీ తీరం ఒడ్డున ఇజ్రాయిల్‌కు చెందిన పురావస్తు శాఖ పరిశోధకుడికి రోమన్ మూన్ దేవత లూనా ముద్రించబడిన 1850వ సంవత్సరం నాటి కాంస్య నాణెం ఒకటి దొరికింది. ఒకవైపు నాణెం మీద మూన్ దేవత లూనా, స్కార్పియోన్ చిత్రాలు ముద్రించబడి ఉండగా.. మరోవైపు రోమన్ చక్రవర్తి ఆంటోనినస్ పియస్(138-161 CE) తల ముద్రించబడింది. ఈ నాణెం అతడి పాలనలో చలామణీ అయ్యి ఉండొచ్చునని ఇజ్రాయిల్ పురాతన వస్తువుల అథారిటీ సిబ్బంది వెల్లడించింది.

ఇజ్రాయెల్ నదీ తీరంలో ఇలాంటి నాణెం దొరకడం ఇదే తొలిసారి అని ఆ యూనిట్ డైరెక్టర్ జాకబ్ షర్విత్ తెలిపారు. ఇది నేషనల్ ట్రెజర్స్ సేకరణలో ఓ అరుదైన కలెక్షన్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి అరుదైన నాణేలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం సముద్రంలో కొట్టుకుపోయాయని.. వాటిల్లో కొన్ని దేశ గత చరిత్రను ప్రతిబింబిస్తాయని ఆయన చెప్పారు.

కాగా, ఈ నాణెం 13 నాణేల శ్రేణికి చెందినదిగా.. ఆ సిరీస్‌లో 12 నాణేలు పన్నెండు రాశిచక్రాలను ప్రతిబింబిస్తే.. 13వ నాణెం పూర్తి రాశిచక్రాన్ని సూచిస్తుందని నాణేన్ని గుర్తించిన పరిశోధకుడు పేర్కొన్నాడు. అంతేకాదు ఈ నాణెం ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ముద్రించబడినదిగా.. ఆంటోనినస్ పయస్ పాలనలోని ఎనిమిదో ఏడాది సమయంలో వాడుకలోకి వచ్చిందని చెప్పాడు.

Rare Coin