Joe Biden: పాపం బైడెన్.. మతిమరుపుతో అమెరికా అధ్యక్షుడు మరోమారు నెట్టింట నవ్వులపాలు

ఆయన వయస్సు 80 ఏళ్లు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన ప్రవర్తన గత కొంతకాలంగా వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ, ఆయన తీరుపై..

Joe Biden: పాపం బైడెన్.. మతిమరుపుతో అమెరికా అధ్యక్షుడు మరోమారు నెట్టింట నవ్వులపాలు
Us President Joe Biden
Follow us

|

Updated on: Aug 11, 2022 | 5:35 PM

US President Joe Biden:  ఆయన వయస్సు 80 ఏళ్లు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన ప్రవర్తన గత కొంతకాలంగా వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ, ఆయన తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వింత ప్రవర్తనకు సంబంధించిన పలు వీడియోలు ఈ మధ్య కాలంలో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరోసారి బైడెన్‌ మతిమరుపు వీడియో తెర మీదకు వచ్చింది. దీంతో ఇక నెటిజన్ల కామెంట్లకు హద్దులు లేకుండా పోయింది. కామెంట్లు, ఫన్నీ ఎమోజీలతో వీడియోను నెట్టింట మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్‌ అవుతున్న వీడియోలో..చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్‌ మెజార్టీ లీడన్‌ చక్‌ షూమర్‌ అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, ఆ తర్వాత స్టేజ్‌ మీద ఉన్న మిగతావాళ్లకు ఇచ్చాడు లీడన్‌. అప్పటికి తను షేక్‌హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చెయ్యాజాపారు. అయితే చేతిని కాసేపు అలాగే షేక్‌ హ్యాండ్‌ పొజిషన్‌లో ఉంచి షాక్‌తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్‌. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

గతంలోనూ ఇలాంటి పొరపాటే చేసి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు బైడెన్‌.. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో..మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు నెటిజనం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ