Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyesight: చిన్న వయస్సులోనే పెరుగుతున్న కంటి సమస్యలు.. కళ్లద్దాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

నేటి పని సంస్కృతి, జీవనశైలి కళ్లపై చెడు ప్రభావం చూపుతోంది. గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై గడపడం వల్ల కంటిచూపు తగ్గిపోతోంది.

Eyesight: చిన్న వయస్సులోనే పెరుగుతున్న కంటి సమస్యలు.. కళ్లద్దాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Eyesight
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 12, 2022 | 8:42 AM

Food For Increase Eyesight: శరీరంలోని అన్ని ఇంద్రియాల్లో కళ్లు ప్రధానమని అంటారు. అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగం కళ్లే. ప్రపంచాన్ని మనం కళ్లతో మాత్రమే చూడగలం. కానీ నేటి పని సంస్కృతి, జీవనశైలి కళ్లపై చెడు ప్రభావం చూపుతోంది. గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై గడపడం వల్ల కంటిచూపు తగ్గిపోతోంది. అంతే కాకుండా, శరీరంలో తగిన పోషకాలు లేకపోవడం వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న పిల్లలు కూడా మందపాటి కళ్లద్దాలు ధరించడం మీరు చూసే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం ద్వారా కంటి చూపును పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..

ఈ పోషకాలు లేకపోవడం వల్ల కంటి చూపు తగ్గుతుంది..

2001లో ప్రచురించబడిన ది ఏజ్-రిలేటెడ్ ఐ డిసీజ్ స్టడీ (ARDS) ప్రకారం.. శరీరంలో జింక్, కాపర్, విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి కొన్ని పోషకాలు లేకపోవడమే కంటి చూపు కోల్పోవడానికి కారణం. ఈ సందర్భంలో ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జియాక్సంతిన్, లుటిన్ , బీటా కెరోటిన్ వంటి పోషకాలను చేర్చడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. దీని కోసం, మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.

ఇవి కూడా చదవండి

క్యాప్సికమ్ – Bell Pepper: కంటి చూపును మెరుగుపర్చడానికి మీ ఆహారంలో రెడ్ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్‌ను చేర్చుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వినియోగం వల్ల కళ్ల రక్తనాళాలు బలపడతాయి. రెడ్ బెల్ పెప్పర్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఇది కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా కళ్లలో విటమిన్లు A, E లోపం ఉండదు.

చేపలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నూనె చేపల వినియోగం కంటి చూపును పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆహారంలో సాల్మన్ వంటి చేపలను చేర్చుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఒమేగా-3 లభిస్తుంది. సాల్మన్ కాకుండా, ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, చిన్న సముద్ర చేపలను కూడా తినవచ్చు.

క్యారెట్: క్యారెట్ తినడం కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే బీటాకెరోటిన్, విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్ కళ్లకు, చర్మానికి చాలా మేలు చేస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..