Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు అలర్ట్.. త్వరలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..

ప్రధానమంత్రి కిసాన్ పథకం 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే 31న విడుదల చేశారు. తదుపరి విడత నగదు నవంబర్లో విడుదల కానుంది.

PM Kisan: రైతులకు అలర్ట్.. త్వరలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..
Pm Kisan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 11, 2022 | 1:59 PM

PM Kisan beneficiary status check 2022: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత నగదు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ విడత కింద అర్హులైన రైతులకు 2 వేల రూపాయలను కేంద్రం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. అయితే ఈ రూ.రెండు వేల నగదు పొందేందుకు ఈ కేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. PM కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత లబ్ధిదారులకు eKYC గడువు జూలై 31తో ముగిసింది. eKYCని పూర్తి చేయని వారు రూ. 2,000 ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదు. చివరిసారిగా, ప్రధానమంత్రి కిసాన్ పథకం 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే 31న విడుదల చేశారు. తదుపరి విడత నగదు నవంబర్లో విడుదల కానుంది. 2019లో రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. పీఎం కిసాన్ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.రెండు వేల చొప్పున మూడు విడతల్లో జమచేస్తుంది. ఇలా రైతులు ఏడాదికి రూ.6వేలు చొప్పున సాయం పొందుతున్నారు.

కాగా.. ఈ కైవైసీ గడువు ముగిసిన నేపథ్యంలో.. పీఎం కిసాన్ నగదుకు మీరు అర్హులా..? కాదా..? అనే విషయాలను ఒకసారి తెలుసుకోవడం ముఖ్యం. దాని కోసం ఈ కింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించండి..

PM కిసాన్ లబ్ధిదారుని స్థితిని రిజిస్ట్రేషన్/మొబైల్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇలా తనిఖీ చేయండి

ఇవి కూడా చదవండి
  • అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించండి
  • బెనిఫిషియరీ స్టేటస్ ట్యాబ్ కోసం సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ కనిపిస్తుంది
  • మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి అంటే రిజిస్ట్రేషన్/మొబైల్ నంబర్
  • ‘ఇమేజ్ కోడ్’ అనే బాక్స్‌లో ఇమేజ్ టెక్స్ట్ లేదా క్యాప్చ్‌ని నమోదు చేయండి
  • ఇప్పుడు లబ్ధిదారుని స్థితిని తనిఖీ చేయడానికి ‘ గెట్ డేటా’ బటన్‌పై క్లిక్ చేయండి
  • అనంతరం లబ్ధిదారుని పూర్తి వివరాలు కనిపిస్తాయి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..