Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crypto Currency: క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల్లో భారతీయు దూకుడు.. ప్రపంచ వ్యప్తంగా ఏడో స్థానంలో..

భారత్‌లో 7.3 శాతం మంది డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టారని తాజా నివేదికలో తేలింది. డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్న పరంగా, ఇది ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఏడవ స్థానంలో ఉంది భారత్.

Crypto Currency: క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల్లో భారతీయు దూకుడు.. ప్రపంచ వ్యప్తంగా ఏడో స్థానంలో..
Crypto
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 11, 2022 | 7:17 PM

ఎవరు నియంత్రిస్తారో తెలియదు.. ఎవరు బాధ్యత వహిస్తారో అంతకన్నా తెలియదు.. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలతో నష్టపోతే బాధ్యత వహించేది ఎవరు?.. క్రిప్టో కరెన్సీల విషయంలో మన దేశంలో మొదటి నుంచి ఇదే రకమైన అయోమయ పరిస్థితులు ఉన్నాయి.. ఇటీవల క్రిప్టో కరెన్సీలు ఉన్నవారి సంఖ్య కూడా అధికంగా ఉందని తేలింది. క్రిప్టోకరెన్సీకి భారత ప్రభుత్వం ఇంకా చట్టపరమైన గుర్తింపు ఇవ్వనప్పటికీ.. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ రావడంలో జాప్యం జరుగుతోంది. అయినప్పటికీ, దేశ జనాభాలో 7 శాతం మంది డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్నట్లుగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో భారతదేశంలో క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. 

7.3% జనాభాతో డిజిటల్ కరెన్సీ

UN ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ UNCTAD తన నివేదికలో ఈ వివరాలను వెల్లడిచింది. 2021లో భారతదేశ జనాభాలో 7.3 శాతం మంది క్రిప్టోకరెన్సీల వంటి డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడి పెట్టారని తెలిపింది. డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్న పరంగా ఇది ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఏడవ స్థానంలో ఉంది. ఉక్రెయిన్ అత్యధిక జనాభాలో 12.7 శాతం డిజిటల్ కరెన్సీలో పెట్టుబడి పెట్టింది. రష్యాలో 11.9 శాతం, వెనిజులాలో 10.3 శాతం, సింగపూర్‌లో 9.4 శాతం, కెన్యాలో 8.5 శాతం, అమెరికాలో 8.3 శాతం మంది డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. 

భారతదేశం వంటి దేశాల్లో పెరిగిన వినియోగం

కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీల వినియోగం పెరిగిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలా పెట్టుబడులు అధికంగా ఉన్నాయని నివేదించింది. ఈ ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు రెమిటెన్స్‌లో సహాయపడ్డాయి.. కానీ సామాజిక నష్టాలు, ఖర్చులతో కూడిన అస్థిర ఆర్థిక ఆస్తి. క్రిప్టోకరెన్సీలలో ఇటీవలి క్షీణత డిజిటల్ కరెన్సీని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రమాదాలను వెల్లడించింది. 

క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. వీటివల్ల దేశ ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం