Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజనలో కీలక మార్పులు.. అలాంటి వారికి ఇకపై నో పెన్షన్.. పూర్తి వివరాలు..

మారిన అటల్ పెన్షన్ యోజన నిబంధనలలో.. ఆదాయపు పన్ను చెల్లింపుదారు అటల్ పెన్షన్ యోజన ఖాతాను అక్టోబర్ 1, 2022 నుంచి తెరవడానికి అర్హులు కాదు

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజనలో కీలక మార్పులు.. అలాంటి వారికి ఇకపై నో పెన్షన్.. పూర్తి వివరాలు..
Atal Pension Yojana
Follow us

|

Updated on: Aug 11, 2022 | 12:33 PM

Atal Pension Yojana new rule: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజన ప్రారంభించింది. అప్పటినుంచి కేంద్రం ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకువస్తోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం నిబంధనలను సవరించింది. ఈ నిబంధనలు 1 తేదీ అక్టోబర్ 2022 నుంచి వర్తించనున్నాయి. మారిన అటల్ పెన్షన్ యోజన నిబంధనలలో.. ఆదాయపు పన్ను చెల్లింపుదారు అటల్ పెన్షన్ యోజన ఖాతాను అక్టోబర్ 1, 2022 నుంచి తెరవడానికి అర్హులు కాదు. ఒకవేళ, ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయిన చందాదారుడు 1 అక్టోబర్ 2022న లేదా ఆ తర్వాత APY స్కీమ్‌లో చేరితే, అతని/ఆమె APY ఖాతాను మూసివేస్తారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇలాంటి ఖాతాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసింది.

ఆగస్టు 10న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం..

  1. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉన్న వారు అక్టోబర్ 1, 2022 నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హులు కాదు.
  2. ఎవరైనా అక్టోబర్ 1కి ముందు లేదా ఆ తర్వాత పథకంలో చేరి ఉంటే.. కొత్త రూల్ అమల్లోకి వచ్చిన తేదీ లేదా అంతకుముందు ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా గుర్తించబడితే అతని/ఆమె ఖాతా వెంటనే మూసివేస్తారు.
  3. అయితే.. అప్పటి వరకు డిపాజిట్ చేసిన పెన్షన్ మొత్తం తిరిగి చెల్లించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

అటల్ పెన్షన్ యోజన ఎంట్రీ రూల్స్

ఇవి కూడా చదవండి
  • ప్రస్తుత అటల్ పెన్షన్ యోజన నిబంధనల ప్రకారం.. 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరుడు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు ప్రకారం.. అటల్ పెన్షన్ యోజన నగదును చెల్లించవలసి ఉంటుంది. నెల నెలా రూ.100 నుంచి రూ.500 వరకు చెల్లించవచ్చు.
  • 60 సంవత్సరాల వయస్సు నుంచి చందాదారులకు నెలకు చెల్లించిన నగదు ప్రకారం.. రూ.1000 నుంచి రూ.5000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటారు.
  • చందాదారుని మరణానంతరం అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లిస్తారు.
  • చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత, చందాదారుని 60 సంవత్సరాల వయస్సు వరకు సేకరించిన పెన్షన్ సంపదను తిరిగి నామినీకి ఇస్తారు.
  • అయితే, కొత్త నియమం అమల్లోకి రావడంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1, 2022 నుంచి ఈ పథకంలో చేరలేరు. పెట్టుబడి పెట్టలేరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..