Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? పరగడుపున ఈ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఇట్టే మాయమవుతుంది..

. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. కొంతమంది ప్రధానంగా తమ బొడ్డు కొవ్వు (బెల్లి ఫ్యాట్) గురించి ఆందోళన చెందుతుంటారు.

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? పరగడుపున ఈ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఇట్టే మాయమవుతుంది..
Belly Fat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 12, 2022 | 7:35 AM

Weight Loss Tips: నేటి కాలంలో ఊబకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. పేలవమైన జీవనశైలి, ఆనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. కొంతమంది ప్రధానంగా తమ బొడ్డు కొవ్వు (బెల్లి ఫ్యాట్) గురించి ఆందోళన చెందుతుంటారు. మీరు కూడా బెల్లీ ఫ్యాట్‌తో భాధపడుతుంటే.. కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా వదిలించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు బెల్లీ ఫ్యాట్‌ను వదిలించుకోవడానికి ఉదయం పరగడుపున ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు వ్యాయామాలు..

క్రంచెస్ : బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి క్రంచెస్ చాలా ప్రభావవంతమైన వ్యాయామం. ఫ్యాట్ బర్నింగ్ వ్యాయామం గురించి మాట్లాడేటప్పుడు క్రంచెస్ చాలామంచి వ్యాయామం అని నిపుణులు పేర్కొంటారు. దీన్ని చేయడం కూడా చాలా సులభం. ఇది చేయడానికి మీ మోకాళ్ళను వంచి, నేలపై ఉంచి వెల్లకిలా పడుకోండి. ఇప్పుడు మీ చేతులను పైకి లేపి, ఆపై వాటిని తల వెనుక ఉంచండి.. ఇప్పుడు మీ పైభాగాన్ని సగం ముందుకు వంచి, ఇలా 10 నుంసీ 5 సార్లు చేయండి. ఇలా చేస్తే బొడ్డు కొవ్వు కొన్ని రోజుల్లోనే మాయం అవుతుంది.

ఇవి కూడా చదవండి
Krunches

Krunches

జుంబా: సరదా వ్యాయామాలు కూడా మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి. జుంబా వ్యాయామం అనేది అధిక తీవ్రత కలిగిన వ్యాయామం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి, పొట్టలోని కొవ్వును త్వరగా కరిగిస్తుంది. కాబట్టి మీరు మీ పొట్ట కొవ్వును వదిలించుకోవాలనుకుంటే, ఈ రోజు నుండి మీ దినచర్యలో జుంబాను భాగం చేసుకోండి..

Jumba

Jumba

సైక్లింగ్: బొడ్డు కొవ్వును కరిగించడానికి సైక్లింగ్ ఒక ప్రభావవంతమైన మార్గం. సైక్లింగ్ మీ తొడలు, నడుము బరువును తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిల మీరు ప్రతిరోజూ పరగడుపున సైక్లింగ్ చేయడం ద్వారా బొడ్డు కొవ్వును సులభంగా వదిలించుకోవచ్చు.

Cycling

Cycling

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..