WhatsApp: 95 శాతం మంది వాట్సాప్ యూజర్లకు స్పామ్ మెసేజ్‌లు.. సర్వేలో షాకింగ్ విషయాలు..
ప్రమాదకరమైన, స్పామ్ మెసేజ్‌ల కట్టడికి టెలికాం రెగ్యూరేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.
ప్రమాదకరమైన, స్పామ్ మెసేజ్‌ల కట్టడికి టెలికాం రెగ్యూరేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. తాజా సర్వేలో ఇదే విషయం తేలింది. ఏకంగా 95 శాతం మంది వాట్సాప్ వినియోగదారులకు ప్రతీరోజూ స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నట్లు తేలింది.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ ప్రకారం.. వాట్సాప్ వినియోగదారలలో 51 శాతం మంది ప్రతిరోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ మెసేజ్‌లు అందుకుంటున్నారు. సగటున, 68 శాతం మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లు ప్రతిరోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ప్రమోషనల్, స్పామ్ మెసేజ్‌లు అందుకుంటున్నారు. సర్వే చేయబడిన ప్రతి మొబైల్ సబ్‌స్క్రైబర్ DND (డు నాట్ డిస్ట్రబ్)తో సంబంధం లేకుండా స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నాయి.
మరొక సర్వే నివేదిక ప్రకారం.. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, పాథాలజీ సేవలు స్పామ్ SMSలను పంపే అగ్ర రంగాలు. అదే నేరస్థులు ఇప్పుడు WhatsApp మెసేజ్‌లు, ఎస్ఎంఎస్ ఛానెళ్లను స్పామ్ చేస్తున్నారని సర్వే తెలిపింది. ‘వాట్సాప్ స్పామ్‌ను పరిష్కరించడానికి TRAI పెద్దగా ఏమీ చేయలేకపోయినా, ప్రస్తుత రిపోర్టింగ్ మెకానిజమ్స్ యూజర్-ఫ్రెండ్లీగా లేనందున 77 శాతం మొబైల్ సబ్‌స్క్రైబర్‌లు టెల్కోలతో కలిసి పనిచేయాలని, SMSలో రిపోర్ట్ స్పామ్ ఫీచర్‌ను ప్రారంభించాలని కోరుకుంటున్నారు. స్పామర్‌లను నివేదించిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని సర్వే రిపోర్ట్ పేర్కొంది.
భారతదేశంలోని 373 జిల్లాల నుండి సర్వేకు 57,000 పైగా స్పందనలు వచ్చాయని లోకల్ సర్కిల్ తెలిపింది. ఈ సర్వేలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు ఉన్నారు. 45 శాతం మంది టైర్-1 నగరాల నుంచి, 32 శాతం మంది టైర్-2 నుంచి, 23 శాతం మంది టైర్-3, 4, రూరల్ జిల్లాల నుంచి పాల్గొన్నారు. వాట్సాప్ వినియోగదారులకు స్పామ్, ప్రచార సందేశాలు 69 శాతం రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి, 66 శాతం ఆర్థిక సేవల సంస్థల నుంచి, 62 శాతం పాథాలజీ సేవలు అందించే సంస్థల నుంచి స్పామ్ మెసేజ్‌లు వస్తున్నట్లు సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది తమకు వాట్సాప్ ద్వారా ఉద్యోగాలు, సంపాదన అవకాశాలకు సంబంధించి మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. 43 శాతం మంది ఆర్ఓ రిపేర్, స్పా, బ్యూటీ కేర్, మసాజ్ వంటి సేవలకు సంబంధించిన మెసేజ్‌లు అందుకుంటున్నట్లు నిర్ధారించారు.
మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..