Bhanupriya : భానుప్రియ చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ బిజీ.. ఇంతకీ ఆమె ఎవరంటే..
ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందమైన రూపం.. చక్కని కళ్లు.. అద్భుతమైన నటనతో కట్టిపడేసిన తారలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కానీ సినిమాల్లో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. పద్దతిగా కనిపించి సహజమైన నటనతో కట్టిపడేసిన హీరోయిన్స్ సైతం ఉన్నారు. అందులో సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఒకరు.

సినీరంగంలో తమదైన ముద్రవేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. అందులో హీరోయిన్ భానుప్రియ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్వర్ణకమలం, సితార, చక్రవర్తి, అన్వేషణ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికీ ఎంతో మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనేక హిట్ చిత్రాల్లో నటించిన భానుప్రియ.. ఆతర్వాత సహాయ నటిగా రాణించింది. యంగ్ హీరోల సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ మీకు తెలుసా.. ? భానుప్రియ చెల్లెలు సైతం తెలుగులో తోపు నటి అని మీకు తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
భానుప్రియ చెల్లెలి పేరు శాంతి ప్రియ. 90’s లో యూత్ ఫేవరేట్ హీరోయిన్ ఆమె. 1980 చివర్లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సౌగంధ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 1987లో వచ్చిన కాబోయే అల్లుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమా తర్వాత తెలుగులో మహార్షి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.1990లో జస్టిస్ రుద్రమదేవి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఈ మూవీ తర్వాత మరో మూవీ చేయలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 1999లో నటుడు సిద్ధార్థ్ రే ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
అయితే పెళ్లైనా కొన్నాళ్లకే ఆమె భర్త సిద్ధార్థ్ రే 2004లో హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అప్పుడు అతడి వయసు 40 సంవత్సరాలు మాత్రమే. భర్త మరణం తర్వాత కుంగిపోయిన శాంతిప్రియ.. తన కుమారులతో ఒంటరిగా లైఫ్ లీడ్ చేసింది. దాదాపు 30 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శాంతి ప్రియ 2025లో వచ్చిన బ్యాడ్ గర్ల్ సినిమాతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..








