PM Modi: హిమగిరుల్లో పరుగులు తీసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ..
దేశంలో నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు వెళ్లనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్ నుండి నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం (అక్టోబర్ 13) జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా నుండి ఢిల్లీ వరకు నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడిచే మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే కావడం విశేషం. ప్రతి బుధవారం మినహా.. ఈ రైలు వారంలో మిగిలిన అన్ని రోజులలో నడుస్తుంది. ఈ రైలు హిమాచల్ నుండి ఢిల్లీకి ప్రయాణించడానికి కేవలం ఐదు గంటల సమయం పడుతుంది. అదే సమయంలో దీని ద్వారా, ఢిల్లీ, చండీగఢ్ మధ్య మూడు గంటల్లో ప్రయాణం చేయవచ్చు.
గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ముంబై మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ఇటీవల జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం ఇది తొమ్మిదోసారి.
Hon’ble PM Shri @narendramodi Ji flags off Vande Bharat Express from Una, Himachal Pradesh. #HimachalWithDoubleEngine pic.twitter.com/wyVjlPhjgQ
— Darshana Jardosh (@DarshanaJardosh) October 13, 2022
వందే భారత్ రైలు మునుపటి వాటితో పోలిస్తే అధునాతన వెర్షన్..
ప్రధాని మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేసిన వందే భారత్ రైలు మునుపటి వాటితో పోలిస్తే అధునాతన వెర్షన్. చాలా తేలికైనది.. తక్కువ వ్యవధిలో ఎక్కువ వేగాన్ని చేరుకోగలదని అధికారులు తెలిపారు. ఈ రైలు బుధవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.
नई रफ्तार से आगे बढ़ रहा है नया भारत।
PM @narendramodi Ji flagged off the 4th #VandeBharat train from Una, Himachal Pradesh to New Delhi. pic.twitter.com/WeyogfSHt8
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 13, 2022
అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్ మరియు ఉనాలో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ. రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధి చెందుతుంది. సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.




