AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Rains: భారీ వర్షాలతో పొంగిపోర్లుతున్న నదులు.. రెండు చోట్ల కొట్టుకుపోయిన డ్యామ్.. జలదిగ్భంధంలో వందల గ్రామాలు

సోనౌలీ నాంకర్ సమీపంలో అశోగ్వా-మదర్వా డ్యామ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. అదే సమయంలో రాత్రి 2 గంటల సమయంలో బన్సీ తహసీల్‌కు చెందిన ధాడియా సమీపంలో కూడా డ్యామ్ విరిగిపోయింది.

UP Rains: భారీ వర్షాలతో పొంగిపోర్లుతున్న నదులు.. రెండు చోట్ల కొట్టుకుపోయిన డ్యామ్.. జలదిగ్భంధంలో వందల గ్రామాలు
Up Rains And Floods
Surya Kala
|

Updated on: Oct 13, 2022 | 11:57 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. సిద్ధార్థనగర్ జిల్లాలో బుధవారం రాత్రి రెండు చోట్ల డ్యామ్ తెగిపోవడంతో పలు గ్రామాల్లోకి నీరు చేరింది.  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీని కారణంగా బుద్ధి రాప్తి నదిపై నిర్మించిన ఆనకట్ట సిద్ధార్థనగర్‌లోని ఇటావా తహసీల్ ప్రాంతంలో రెండు చోట్ల విరిగిపోయింది. దీంతో 150కి పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సోనౌలీ నాంకర్ సమీపంలో అశోగ్వా-మదర్వా డ్యామ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. అదే సమయంలో రాత్రి 2 గంటల సమయంలో బన్సీ తహసీల్‌కు చెందిన ధాడియా సమీపంలో కూడా డ్యామ్ విరిగిపోయింది.

ఆనకట్ట తెగిపోవడంతో వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లలోని సామాన్లతో ప్రజలు వలసబాట పడుతున్నారు. గ్రామస్తుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో రప్తి, బుధిరప్తి నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. నది చుట్టూ ఉన్న డజన్ల కొద్దీ గ్రామాలకు అర్థరాత్రి ప్రధాన రహదారితో సంబంధాలు తెగిపోయాయి.

ఇవి కూడా చదవండి

తగిన సాయం అందలేదని గ్రామస్థుల ఆరోపణలు: 

రప్తి నది నీటిమట్టం పెరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. చాలా గ్రామాలు రోడ్లతో కనెక్టివిటీని కోల్పోయాయి. ఇప్పుడు ప్రజలు పడవ మీదనే ప్రయాణిస్తున్నారు. రప్తి నది నీరు అనేక గ్రామాలను ముంచెత్తుతోంది. ప్రజలు పడవల సహాయంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇటీవల డ్యాం పనులు జరిగాయని.. అయితే నిర్మాణం సమయంలో భారీ అక్రమాలు జరిగాయని.. అందుకనే ఆనకట్ట తెగిపోయిందని ప్రజలు చెబుతున్నారు. తమ కష్టాలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇళ్ల పై కప్పులపై కూర్చున్న ప్రజలు  బలరాంపూర్‌లో వందలాది గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంది. ఇక్కడ పాఠశాలలు, ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. ప్రజలను ఇళ్ల పైకప్పులపైకి లేదా ఎత్తైన ప్రదేశాలలో చేరుకున్నారు. వరద బాధితుల సహాయార్ధం..  NDRF, SDRF, వరద PAC సిబ్బంది రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తోంది. సహాయ, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ అనేక వరద బాధిత ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది చేరుకోలేదు. ముఖ్యంగా వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తాగునీటి సమస్య అతిపెద్ద సమస్యగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..