AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Coconut Oil on Skin – చర్మానికి కొబ్బరి నూనె ప్రయోజనాలు.. ఇలా రాసుకుంటే మెరిసే అందం మీ సొంతం..

రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం ఫేస్ వాష్ సహాయంతో ముందుగా ముఖాన్ని శుభ్రం చేయండి. ఇప్పుడు

Benefits of Coconut Oil on Skin - చర్మానికి కొబ్బరి నూనె ప్రయోజనాలు.. ఇలా రాసుకుంటే మెరిసే అందం మీ సొంతం..
Coconut Oil Benefits
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2022 | 8:57 AM

Share

కొబ్బరి నూనె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చర్మ సంరక్షణ పదార్ధం.. చాలా మంది దీనిని ఆయిల్ బేస్డ్ మేకప్ రిమూవర్‌గా, అండర్ ఐ మాయిశ్చరైజర్‌గా, నైట్ క్రీమ్‌గా కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, రాత్రిపూట ముఖంపై ఉంచినప్పుడు ఇది గొప్ప బాడీ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో జుట్టు బలానికి కొబ్బరి నూనెను అప్లై చేస్తుంటారు. కానీ దీన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

చర్మానికి కొబ్బరి నూనె ప్రయోజనాలు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టుకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. కొబ్బరి నూనె చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనితో పాటు ఇది మీ ముఖంలోని మృతకణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి, చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజింగ్ చేయడానికి పనిచేస్తుంది. ఇది చర్మంపై మొటిమలను కూడా నియంత్రిస్తుంది. చర్మపు మచ్చలను తొలగిస్తుంది.

కొబ్బరి నూనెను ఈ విధంగా ఉపయోగించండి- ఫేషియల్ మార్క్స్ తొలగించడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం చాలా సులభం. దీని కోసం ఫేస్ వాష్ సహాయంతో ముందుగా ముఖాన్ని శుభ్రం చేయండి. ఇప్పుడు కొబ్బరినూనెలో అలోవెరా జెల్, నిమ్మకాయ, మిక్స్ చేసి ముఖానికి పట్టించి, దానితో ముఖాన్ని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇప్పుడు ముఖం మీద రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే లేచి, శుభ్రమైన నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మొటిమల మచ్చలు తొలగిపోతాయి. కొబ్బరి నూనె చర్మంలో కొల్లాజెన్ ను పెంచడం ద్వారా ముడతలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మంపై కొబ్బరి నూనె ఉపయోగించే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు. చర్మం జిడ్డుగా ఉంటే కొబ్బరి నూనెను ఉపయోగించవద్దు. ముఖం మొత్తానికి నూనె రాయాలి. కళ్లకు మాత్రం విడిచిపెట్టండి. కొబ్బరి నూనెను ఉపయోగించడం ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండదు. దాని ఉపయోగం వల్ల కొన్ని నష్టాలు కూడా రావచ్చు. సున్నితమైన చర్మంపై కొబ్బరి నూనెను ఉపయోగించడం హానికరం. కొబ్బరికీ అలర్జీ ఉన్నవారిలో కొబ్బరి నూనెకు అలర్జీ సమస్య కూడా ఉండవచ్చు. లారిక్ యాసిడ్ ఉండటం వలన, బ్రెస్ట్ కు అప్లై చేసినప్పుడు తల్లి పాలు తాగే శిశువులలో ఇది అలర్జీ ప్రతి చర్యలకు కారణమవుతుంది. కొబ్బరి నూనె అధిక మొత్తంలో ఉండటం వల్ల చర్మం జిగటగా, జిడ్డుగా మారుతుంది. చర్మం కోసం కొబ్బరి నూనె వాడకానికి సంబంధించిన ఈ కథనం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..