ఆమెతోనే సదా.. ఆస్పత్రిలో భార్యకు అండగా వృద్ధుడు.. మనసును లాలించే మనోహర దృశ్యం..

ఈ వీడియోలో ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను పొందితేనే అర్థం అవుతుంది. జీవితాంతం వరకు ప్రేమను అందించే వ్యక్తి అంటూ ఈ వీడియోని పోస్ట్ చేశారు.

ఆమెతోనే సదా.. ఆస్పత్రిలో భార్యకు అండగా వృద్ధుడు.. మనసును లాలించే మనోహర దృశ్యం..
Old Age
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 13, 2022 | 1:24 PM

నేడు భర్త దీర్ఘాయువు కోసం దేశవ్యాప్తంగా వివాహిత మహిళలు కర్వా చౌత్ ఉపవాసాన్ని పాటిస్తున్నారు. ఈ నిర్జల వ్రతం రాత్రిపూట చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా పరిసమప్తి అవుతుంది.. ఉపవాసం పాటించే స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. అటువంటి పరిస్థితిలో ఒక అందమైన జంట హృదయాన్ని గెలుచుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను పొందితేనే అర్థం అవుతుంది. జీవితాంతం వరకు ప్రేమను అందించే వ్యక్తి అంటూ ఈ సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేశారు.

నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న ఈ వీడియోలో..ఆసుపత్రిలో ఉన్న ఒక వృద్ధ దంపతులు కనిపిస్తున్నారు. ఇది ప్రేమ, భార్యాభర్తల నిజమైన సంబంధాని నిదర్శనంగా నిలిచిన సంఘటన. వీడియో ఆధారంగా ఆ వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురైందని అర్థం అవుతుంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వీడియోలో తెలుస్తుంది. అక్కడ ఆమె మంచం మీద పడుకుని కనిపించింది. ఇంతలో ఆ వృద్ధురాలికి భర్త ధైర్యం పెంచుతూ..ఆమెకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇది చూసి కోట్లాది మంది వినియోగదారుల గుండెలు చలించిపోయాయి. వీడియోలో వృద్ధుడు మహిళను తన ఒడిలో పెట్టుకుని చూసుకుంటున్నాడు. దీన్ని చూసిన యూజర్లు ఆ వీడియోపై మనసు పారేసుకుంటున్నారు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. అదే సమయంలో ఈ వీడియోకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వార్తలు రాసే సమయానికి లక్షల సంఖ్యలో కామెంట్స్‌, లైకులు వచ్చాయి. ప్రస్తుతం, వీడియోను చూసిన తర్వాత వినియోగదారులు నిజమైన ప్రేమకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ స్త్రీ భూమిపై అత్యంత అదృష్టవంతురాలు. వీడియో చూసిన నెటిజన్లు వృద్ధ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి