Father Love : సివిల్స్ కోసం రెడీ అవుతున్న కుమార్తె.. ఆ ఆటో డ్రైవర్ తాపత్రయం చూస్తే ఎవరైనా ఫిదా అవుతారు..
ఆటో నడుపుకుంటూ పోటీ పరీక్షల కోసం సిద్ధం కావడం లేదా ఉన్నత చదువులు చదువుతూ తమ పోషణ కోసం ఫుడ్ డెలివరీ, నిత్యావసర వస్తువుల డెలివరీ చేస్తూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వారి గురించి వినే ఉంటాం. కాని యూపీఎస్సీ పరీక్షల సిద్ధం..
ఆటో నడుపుకుంటూ పోటీ పరీక్షల కోసం సిద్ధం కావడం లేదా ఉన్నత చదువులు చదువుతూ తమ పోషణ కోసం ఫుడ్ డెలివరీ, నిత్యావసర వస్తువుల డెలివరీ చేస్తూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వారి గురించి వినే ఉంటాం. కాని యూపీఎస్సీ పరీక్షల సిద్ధం అవుతున్న తన కుమార్తె కోసం ఓ తండ్రి కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతూ చదవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ స్టోరిని మహారాష్ట్రలోనే పుణేలో నివాసం ఉంటూ జెపి మోర్గాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ గా పనిచేస్తున్న అభిజిత్ ముత్తా లింక్ డ్ ఇన్ లో పోస్టు చేశాడు. తమ పిల్లలు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుంది. పిల్లల గురించి తండ్రి ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని ఈ పోస్టు తెలియజేస్తుంది. ఉబర్ యాప్ లో నమోదై ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి తాను ఆటో నడుపుతూ యుపిఎస్సీకి సంబంధించిన పాఠ్యాంశాలు చదువుకుంటున్నాడు. ఓ వ్యక్తి తన కుమార్తెను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం చేయడంలో సహాయం చేయడానికి తన ఆటోలో క్రమం తప్పకుండా చదువుకుంటున్నాడని అభిజీత్ ముత్తా పేర్కొన్నాడు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఇప్పటివరకు ఈ స్టోరీని చాలా మంది చదివారు.
అభిజిత్ ముత్తా ఉబర్ యాప్ లో ఆటోను బుక్ చేసాడు. రాకేష్ అనే ఆటో డ్రైవర్ పికప్ చేసుకోవడానికి వచ్చాడు. ఆటోలో యూట్యూబ్‌లో వీడియో చూస్తున్న రాకేష్.. ముత్తా ఆటో ఎక్కిన తర్వాత, వీడియో ఆపి, నావిగేషన్ విండోను తెరిచాడు. కొద్దిసేపటి తర్వాత, అతను మళ్లీ యూట్యూబ్‌కి వెళ్లి వీడియోను చూడటం మొదలుపెట్టాడు. రాకేష్ ఆటోలోని యూట్యూబ్ లో వీడియో వినడంపై ముత్తా ఆటోడ్రైవర్ ను అడిగాడు మూట్యూబ్ లో ఆ ఛానల్ లో వీడియోలు చూస్తున్నావేంటి అని, వెంటనే స్పందించిన ఆటో డ్రైవర్ ఈ ఛానెల్‌లో కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్‌లో కంటెంట్ బాగుంటుందని బదులిచ్చాడు. వెంటనే ముత్తా కలుగజేసుకుని నువ్వు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నావా అని అడగ్గా, లేదు.. మా అమ్మాయి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం అవుతోంది. ఆమె లైబ్రరీలో చదువుకుని వచ్చిన తర్వాత ఇంట్లో మేమిద్దరం ఈ విషయాలపై డిస్కస్ చేస్తాం అని రాకేష్ సమాధానం ఇచ్చాడని తెలిపాడు ముత్తా.
ఇది నయా భారత్ ప్రయత్నాల్లో భాగం అంటూ పోస్టును ముగించాడు ముత్తా. అయితే ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియో చూడటం లేదని చెప్పగా.. దీనికి ముత్తా బదులిస్తూ.. నిజమే ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు ఆయన వీడియో చూస్తున్నాడు. డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవింగ్ పైనే దృష్టి మొత్తం కేంద్రీకరిస్తున్నాడని చెప్పాడు. మొత్తం మీద తన కుమార్తె లక్ష్యం సాకారం కావాలని ఓ తండ్రి పడుతున్న తపనకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చదవండి..