AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: చిట్టెలుకతో పోటీ పడి ఓడిపోయాడు.. లేడీ అండ్ ది ట్రాంప్‌ని తలపించే సన్నివేశం..

కొన్ని సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అవి నమ్మలేని నిజాలు. తీరా చూసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అనుకుంటాం. సాధారణంగా చిట్టెలుక అంటే అందరికి తెలుసు.. దాని బరువు 100 నుంచి 150 గ్రాముల బరువు మించి..

Funny Video: చిట్టెలుకతో పోటీ పడి ఓడిపోయాడు.. లేడీ అండ్ ది ట్రాంప్‌ని తలపించే సన్నివేశం..
Lady and the Tramp spaghetti kiss scene (File Photo)
Amarnadh Daneti
|

Updated on: Oct 13, 2022 | 1:54 PM

Share

కొన్ని సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అవి నమ్మలేని నిజాలు. తీరా చూసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అనుకుంటాం. సాధారణంగా చిట్టెలుక అంటే అందరికి తెలుసు.. దాని బరువు 100 నుంచి 150 గ్రాముల బరువు మించి ఉండదు. అంతగా బలంలేని జంతు జీవుల్లో చిట్టెలుక ఒకటి. కొంతమంది చిట్టెలుకలను కూడా పెంచుకుంటుంటారు. పెంపుడు జంతువులతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఒకోసారి పెంపుడు జంతువులతో పోటీపడి ఎంజాయ్ చేస్తుంటారు. కాని ఓ మనిషి చిట్టెలుకతో బలాన్ని నిరూపించుకునే పోటీ పడితే తప్పకుండా చిట్టెలుక ఓడిపోతుందని అందరికి తెలుసు. కాని నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం చిట్టెలుక తన యజమానితో పోటీపడి గెలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యజమాని కావాలనే తన పెంపుడు జంతువు సంతోషం కోసం ఓడిపోయాడా లేదా చిట్టెలుక యజమానిని ఓడించిందా అనే స్పష్టత లేకపోయినా, ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా ఈసీన్ చూస్తే మాత్రం 1955 లో వచ్చిన యానిమేషన్ చలన చిత్రం లేడీ అండ్ ది ట్రాంప్‌ని తలపిస్తోంది. సరిగ్గా ఈ మూవీలో వలె ఓ ట్రెడ్ ను నోటితో లాక్కోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తారు.

ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో కూడా ఈ యానిమేషన్ చలన చిత్రాన్ని గుర్తు తెచ్చేలా ఉంది. ఓ పొడవాటి ట్రెడ్ ను చిట్టెలుకతో పాటు దాని యజమాని నోటితో లాగడానికి ప్రయత్నిస్తారు. యానిమేషన్ చలనచిత్రంలోని ఐకానిక్ సన్నివేశాలలో ఒకదానిని ఓ వ్యక్తి తన పెంపుడు చిట్టెలుకతో పునఃసృష్టి చేయడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనబడుతోంది. అయితే ఈ పోటీలో వ్యక్తి ఆశించిన ఫలితం రాకుండా చిట్టెలుక యజమానికి ప్రతికూలమైన ఫలితం వస్తుంది.

ఇవి కూడా చదవండి

తన యజమాని నుంచి పెంపుడు చిట్టెలుక ట్రెడ్ ను లాక్కోవడంతో వీడియో ముగుస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియోను 14 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..