Bharat Jodo Yatra: కర్నాటక నుంచి ఏపీలోకి భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు..

కర్నాటక నుంచి ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ పాదయాత్రకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.

Bharat Jodo Yatra: కర్నాటక నుంచి ఏపీలోకి భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు..
Bharat Jodo Pada Yatra
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 14, 2022 | 10:46 AM

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఏపీ సరిహద్దుల్లో భారీ స్వాగతం లభించింది. అనంతపురం జిల్లాలో రాహుల్‌ గాంధీకి గ్రాండ్‌గా స్వాగతం పలికారు ఏపీ కాంగ్రెస్‌ నాయకులు. రాహుల్‌ గాంధీని చూసేందుకు జనం భారీగా చేరుకున్నారు. ఈ ఉదయం ఏడు గంటలకు కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో యాత్ర ప్రారంభమైంది. పది గంటలకు అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్‌ ప్లాజా దగ్గర కొద్దిసేపు రాహుల్ రెస్ట్ తీసుకుంటారు. అనంతరం పాదయాత్రను మొదలు పెట్టారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్రమాజీమంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు స్వాగతం పలికనవారిలో ఉన్నారు. ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగుతుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ్టి షెడ్యూల్ ఇలా..

  • ఉదయం 7 గంటలకు కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో పాదయాత్ర మొదులు పెట్టారు.
  • ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్ద చేరుకుంటారు. అక్కడే రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.
  • సాయంత్రం 04.30 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది.
  • సాయంత్రం 06.30 గంటలకు అనంతపురం జిల్లా ఓబులాపురం గ్రామంలో ఆగిపోతుంది.
  • రాత్రికి బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఇలా..

ఏపీ మీదుగా తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర రానుంది. ఈ నెల 23న తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనున్నారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ ఎంట్రీ కానుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ మీదుగా మద్నూర్ వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. రూట్‌ మ్యాప్‌ ప్రకారం మక్తల్, దేవరకద్ర, మహాబూబ్ నగర్ టౌన్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మోజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయినపల్లి గాంధీ ఐడీయాలజీ సెంటర్, బాలానగర్, మూసాపేట్ జంక్షన్ , కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరువు, ఓటర్ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరం పేట్, మద్దునూర్‌ల మీదగా ఈ పాదయాత్ర కొనసాగనుంది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?