Weight Loss Tips: బరువు తగ్గాలని భావిస్తున్నారా? ఈ డ్రైఫ్రూట్స్ మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి..
వ్యక్తి ఆరోగ్యంగా ఉండటంలో డ్రైఫ్రూట్స్ ఎంత ఉపకరిస్తాయో తెలిసిందే. డ్రైఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు, డ్రైఫ్రూట్స్ తినడం వలన..
వ్యక్తి ఆరోగ్యంగా ఉండటంలో డ్రైఫ్రూట్స్ ఎంత ఉపకరిస్తాయో తెలిసిందే. డ్రైఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు, డ్రైఫ్రూట్స్ తినడం వలన ఆరోగ్యకరమైన బరువు తగ్గుతుంది. బరువు తగ్గడంలో కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ అద్భుతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ మనం తినే ఆహారంలో గానీ, ఉదయాన్నే గానీ డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. మీరు కూడా బరువు తగ్గిందేందుకు ప్రయత్నిస్తున్నారా? ఆరోగ్యకరమైన బరువు తగ్గాలంటే ఖచ్చితంగా డ్రైఫ్రూట్స్‌ని డైట్‌లో చేర్చుకోండి. మరి బరువు తగ్గడానికి ఏ డ్రైఫ్రూట్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాల్ నట్స్..
వాట్ నట్స్‌లో ఖనిజాలు, ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్ తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. క్రమంగా బరువు తగ్గుతారు. అయితే, ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూ తీసుకోవడం వలన శరీరానికి శక్తి లభిస్తుందని, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయని చెబుతున్నారు.
బాదం..
జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి బాదం పప్పును ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. బాదం పప్పులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ బాదం పప్పు శరీరంలోని చెడు కొవ్వును తగ్తిస్తుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పిస్తా..
పిస్తాలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే.. కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఫలితంగా అతిగా తినకుండా కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంతేకాదు.. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు.
ఎండుద్రాక్ష..
ఎండుద్రాక్షను అనేక రకాల డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు. వంట రుచిని పెంచడానికి కూడా ఎండుద్రాక్షను వినియోగిస్తారు. స్నాక్స్‌గా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇవి బరువు తగ్గాలనుకునే వారు రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. వేగంగా బరువు తగ్గడంలో ఉపకరిస్తుంది. ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి, అవి నానబెట్టిన వాటర్ కూడా తాగొచ్చు. రక్త హీనత సమస్య సహా అనేక సమస్యలు తొలగిపోతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..